న్యూఢిల్లీ : గతేడాది రెండో అర్ధ భాగంలో భారతీయ సాఫ్ట్‌వేర్ మార్కెట్ వృద్ధి 10 శాతంగా నమోదైంది. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి టాప్ ఐటీ కంపెనీలు స్థిరంగా రెండంకెల వృద్ధిని నమోదు చేయడమే దీనికి కారణమని ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) తన నివేదికలో తెలిపింది. నివేదిక ప్రకారం.. భారతీయ సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో ప్రాథమికంగా అప్లికేషన్ డెవలప్‌మెంట్ డిప్లాయ్‌మెంట్, అప్లికేషన్స్, సిస్టమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ సాఫ్ట్‌వేర్(ఎస్‌ఐఎస్) అనే మూడు భాగాలున్నాయి.
అప్లికేషన్ డెవలప్‌మెంట్ డిప్లాయ్‌మెంట్ మార్కెట్ వృద్ధి 9.5 శాతంగా, అప్లికేషన్స్ మార్కెట్ వృద్ధి 10.8 శాతంగా, ఎస్‌ఐఎస్ మార్కెట్ వృద్ధి 8.5 శాతంగా ఉంది. అప్లికేషన్ ప్లాట్‌ఫామ్స్, కంటెంట్, ఆపరేషన్స్, మ్యానుఫ్యాక్షరింగ్ అప్లికేషన్స్ వంటి తదితర సెకండరీ మార్కెట్ విభాగాలు కూడా మంచి వృద్ధినే నమోదుచేశాయి.
భారతీయ సాఫ్ట్‌వేర్ మార్కెట్ వృద్ధి 10 శాతం
Published Fri, Jun 26 2015 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM
Advertisement