ఐదేళ్లలో ఐటీకి మహర్దశ: కేటీఆర్
ఐటీఐఆర్‌లో భాగస్వామ్యం కోరిన ‘ఒరాకిల్’
హైదరాబాద్: రానున్న ఐదేళ్లలో రాష్ట్ర ఐటీ రంగానికి మహర్దశ పట్టిస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ రంగాన్ని దేశంలో ఐదో స్థానానికి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామనివెల్లడించారు. బుధవారమిక్కడ ఒరాకిల్, ఇతర సంస్థల ప్రతినిధులు సచివాలయంలో కేటీఆర్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో అభివృద్ధి చేయనున్న ఐటీఐఆర్ ప్రాజెక్టులో తమ భాగస్వామ్యం, పెట్టుబడులు, ప్రాజెక్టు లక్ష్యాలు, ఉద్యోగకల్పన వంటి అంశాలపై వారు మం త్రికి చిత్రపటాలు, గణాంకాలతో వివరించా రు. కేటీఆర్ వారికి పలు సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో ఎంపీ జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎస్‌డీఎఫ్ పనులు తక్షణమే ఆపేయండి
మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్) కింద మం జూరైన పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని కింద ఉమ్మడి రాష్ట్రంలో పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలకు రూ.150 కోట్లు ఇచ్చారు. వాటితో చేప ట్టిన పనులపై ఆరోపణలు రావడంతో ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య కలెక్టర్లకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.