సీమాంధ్రులకు ఎటువంటి ఢోకాలేదు: కేటీఆర్ | Seemandhra people safe in Telangana, says Kalvakuntla Taraka Rama Rao | Sakshi
Sakshi News home page

సీమాంధ్రులకు ఎటువంటి ఢోకాలేదు: కేటీఆర్

Published Wed, Feb 26 2014 1:28 PM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM

సీమాంధ్రులకు ఎటువంటి ఢోకాలేదు: కేటీఆర్

సీమాంధ్రులకు ఎటువంటి ఢోకాలేదు: కేటీఆర్

తెలంగాణ ప్రాంతంలో నివసించే సీమాంధ్రులకు ఎటువంటి ఢోకా ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీ నుంచి బుధవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి అన్నదమ్ముల్లా కలసి ఉండి అభివృద్ధి చేసుకుందామన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకుని కేటీఆర్కు స్వాగతం పలికారు.



తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలలో ఇటీవలే ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులంతా ఢిల్లీ తరలివెళ్లారు. ఆ క్రమంలో సోనియాను కలసి ఆదివారం కేసీఆర్తోపాటు ఆయన కుటుంబ సభ్యులు ధన్యవాదులు తెలిపారు. అనంతరం కేటీఆర్ బుధవారం హైదరాబాద్ తిరిగివచ్చారు. ఈ రోజు సాయంత్రం 3.00 గంటలకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హైదరాబాద్ నగరానికి రానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement