సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన తీర్మానం రాష్ట్ర శాసనసభకు వస్తుందంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంకా సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని టీఆర్‌ఎస్ పార్టీ ఆరోపించింది. శాసనసభలో తీర్మానం అవసరం లేదనుకొనే కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిపిందని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు బి. వినోద్‌కుమార్ అన్నారు. పార్టీ నేతలతో కలిసి మంగళవారం తెలంగాణభవన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు.
ఏన్డీయే ప్రభుత్వం గతంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను విభజించి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సమయంలో.. ముందు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో విభజనకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసిన తర్వాతే అందుకు సంబంధించిన కేబినెట్ నోట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పు డు మన రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి కేబినెట్ నోట్‌పై నిర్ణ యం జరిగిపోయిందన్నారు. అయినా అసెంబ్లీకి తీర్మానం వస్తుం దంటూ ముఖ్యమంత్రి చెప్పడాన్ని వారు తప్పుపట్టారు. ఆ ప్రక్రియ అధిగమించాకే కేబినెట్ నోట్ నిర్ణయం జరిగిందన్నారు. కేంద్రం ఏర్పా టు చేసిన మంత్రుల బృందం విభజన పె పాథమిక నివేదిక రూపొందించి తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపుతారని, అనంతరం ఆయన అభిప్రాయాలను మాత్రమే తెలుసుకుంటారన్నారు.
దానికి సంబంధించి ఎలాంటి ఓటింగ్ ఉండే అవకాశమే లేదని స్పష్టంచేశారు. ఈ మాత్రం అవగాహన లేని పరిస్థితిలో కిరణ్, చంద్రబాబు ఉన్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ తీర్మానానికి సంబంధించి దిగ్విజయ్‌సింగ్ కొంత గందరగోళపరిచేలా వ్యాఖ్యలు చేశారని తప్పుపట్టారు. గతంలో ఉమ్మడి పంజాబ్‌ను విభజించినప్పుడు కేవలం సీడబ్లూసీ తీర్మానం చేశారని, ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కోరకుండానే విభజన ప్రక్రియ పూర్తి చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కిరణ్ మాదిరే ఆ సమయంలో అప్పటి పంజాబ్ సీఎం విభజనను వ్యతిరేకిస్తే రాష్ట్రపతి పాలన విధించారన్నారు. పంజాబ్ విభజన ప్రక్రియపై ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటి రాష్ట్రపతి రాజ్యాంగంలో రాష్ట్రాల విభజన ఆర్టికల్‌లో కొంత భాగాన్ని సస్పెండ్ ఉంచుతున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారంంటూ.. అందుకు సంబంధించిన కాపీని మీడియాకు చూపించారు.
తీర్మానం పేరుతో మోసం: టీఆర్‌ఎస్
Published Wed, Oct 9 2013 4:11 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement