ఒరాకిల్ ప్రెసిడెంట్‌గా భారతీయుడు
థామస్ కురియన్ నియామకం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజాల్లో మరో కంపెనీ సారథ్య బాధ్యతలు భారతీయుడికి దక్కాయి. ఒరాకిల్ ప్రెసిడెంట్‌గా థామస్ కురియన్ (48) నియమితులయ్యారు. ఆయన ఒరాకిల్‌లో 1996లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ప్రోడక్ట్ డెవలప్‌మెంట్)గా చేరారు. కురియన్ నియామకం వార్త తెలియగానే కేరళలో ఆయన కుటుంబసభ్యులు సంబరాలు జరుపుకున్నారు. కురియన్ కుటుంబం కొట్టాయం జిల్లా పాంపడికి చెందినది కాగా ఆయన విద్యాభ్యాసం బెంగళూరు, అటుపైన అమెరికాలో సాగింది.
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన ఎంబీయే చేశారు. పలు అంతర్జాతీయ వెంచర్ ఫండ్స్, సాఫ్ట్‌వేర్ కంపెనీల బోర్డుల్లో కూడా ఆయన సలహాదారుగా పనిచేశారు. 2009లో ఒరాకిల్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత సాఫ్ట్‌వేర్ విభాగం వార్షిక అమ్మకాలు 18.9 బిలియన్ డాలర్ల నుంచి 29.2 బిలియన్ డాలర్లకు ఎగిశాయి.