ఉత్తరకొరియా అధ్యక్షుడి నిరంకుశ పాలన గురించి తరచూ వార్తల్లో వింటూనే ఉంటాం. వివాదాస్పద నిర్ణయాలతో గ్లోబల్ మీడియాలో నిలుస్తుంటారు. భయంకరమైన చట్టాలతో దారుణ శిక్షలకు గురిచేస్తుంటారు. ఇలాంటి ఓ విషయాన్నే అమెరికా నివేదిక వెల్లడించింది. ఆ దేశంలో బైబిల్ కలిగి ఉన్నవారికి మరణశిక్షను విధిస్తున్నారంట. ఆ కుటుంబ సభ్యులను కఠిన శిక్షలకు గురిచేస్తున్నారు. అలా ఓ రెండేళ్ల చిన్నారికి కూడా జీవితఖైదు విధించినట్లు నివేదిక పేర్కొంది.
జైళ్లలో మగ్గుతున్న 70 వేల మంది
అమెరికా విదేశాంగ శాఖ 'అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2022' పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఉత్తరకొరియాలో ఇతర మత విశ్వాసాలను అవలంభించిన వారిపై దారుణంగా ప్రవర‍్తిస్తున్నారని నివేదిక పేర్కొంది. దాదాపు 70 వేల మంది క్రిస్టియన్స్ జైళ్లలో మగ్గుతున్నారని వెల్లడించింది. మత గ్రంథాన్ని కలిగి ఉండటం, మతపరమైన కార్యకలాపాలకు పాల్పడ్డారనే అభియోగాలతో 2009లో ఓ చిన్నారి కుటుంబాన్ని అరెస్టు చేశారు. వారందరికీ జీవిత ఖైదు విధించారని నివేదిక వెల్లడించింది.
దారుణ వేధింపులు
ఆ దేశంలో మతపరమైన శిక్షలు అనువభవిస్తున్న వారందరు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. శారీరక హింస, జీవించే హక్కుకు భంగం వాటిల్లడం, పారదర్శక విచారణ జరపకపోవడం, లైంగిక వేధింపులతో వారిని వేధిస్తున్నారని నివేదిక వెల్లడిచ్చింది.
కొరియా ఫ్యూచర్ అనే లాభాపేక్ష లేని సంస్థ డిసెంబర్ 2021లోనే ఓ నివేదికను విడుదల చేసింది. మతపరమైన స్వేచ్ఛ ఆ దేశంలో అడుగంటిపోయిందని తెలిపింది. మత స్వేచ్ఛను కోరుకుంటే వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపింది. అవయవాల దోపిడి, హత్యలు అత్యాచారం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారని పేర్కొంది.
చదవండి: ‘స్నేక్ వైన్’ అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే...
Comments
Please login to add a commentAdd a comment