మేనేజ్‌మెంట్ పాఠాలు | Management Lessons! | Sakshi
Sakshi News home page

మేనేజ్‌మెంట్ పాఠాలు

Published Sun, Dec 20 2015 1:38 AM | Last Updated on Sun, Sep 3 2017 2:15 PM

మేనేజ్‌మెంట్ పాఠాలు

మేనేజ్‌మెంట్ పాఠాలు

బైబిల్ కేవలం మత గ్రంథమే కాదు, నాయకత్వ లక్షణాలను తెలియజెప్పే మేనేజ్‌మెంట్ బుక్ కూడా. వ్యాపార విజయాలు, నిర్వహణాసూత్రాల గురించి అద్భుత రచనలు చేసిన జాన్ సి మ్యాక్స్‌వెల్‌కూ స్ఫూర్తి  బైబిలే. అలాంటి కొన్ని ఉదాహరణలు మీకోసం..
 బైబిల్ పాఠం - 1
 ప్రణాళిక.. ప్రాతినిథ్యం.. సమష్టి కృషి!
 క్రీస్తు పూర్వం 444 సంవత్సరంలో ఇజ్రాయెల్ పరాయి రాజుల పరమైంది.

జెరూసలేమ్‌కు రక్షణగా ఉన్న శివారు గోడ ధ్వంసమైంది. యూదులు చాలామంది వలస వెళ్లిపోయారు. అలా మరికొంత మంది పర్షియాకు వెళ్లారు. వాళ్లలో ఒకడే నెహెమ్యా. పర్షియా రాజు ఆకేజక్సీస్‌కు సేవకుడిగా చేరాడు. అయితే  జెరూస లేమ్‌లోనే ఉండిపోయిన ఇంకొంతమంది యూదులు పట్టణ గోడ కూలడం వల్ల అభద్రతకు లోనై భయపడ్డం మొదలు పెట్టారు. అది నెహెమ్యాకు తెలిసింది. ఎలాగైనా ఆ గోడను మళ్లీ కట్టించాలి అను కున్నాడు.

జెరూసలేమ్ స్థితిగతులు, అక్కడి యూదుల బలాబలాలు వంటివన్నీ క్షుణ్నంగా పరిశీలించాడు. గోడ కట్టడానికి ఎలాంటి సరుకు, సామాగ్రి కావాలో నిర్ధా రించుకున్నాడు. నిర్మాణానికి పట్టే సమ యాన్నీ అంచనా వేసుకున్నాడు. దేవుడిని ప్రార్థించి, ఆనక రాజుగారి ప్రాసాదంలోకి అడుగుపెట్టాడు. జెరూసలేమ్‌లోని పరి స్థితిని, తన ప్రణాళికను వివరించి సహా యాన్ని అర్థించాడు. సహాయం అందిస్తే కేవలం 52 రోజుల్లో ఆ గోడ పని పూర్తి చేయగలనని స్పష్టం చేశాడు.

తాను చేయా లనుకున్న టాస్క్‌కు బాస్‌ని ఎలా ఒప్పిం చాలి అనేదానికి ఇది ఓ మంచి మేనేజ్ మెంట్ పాఠం. తన వాళ్లకోసం రక్షణ గోడ కట్టడానికి శత్రురాజు మద్దతు కూడగట్టు కున్నాడు. అసలు రాజుగారిని నెహెమ్యా నేరుగా సంప్రదించే అవకాశాన్నిచ్చింది ఆయన వ్యక్తిత్వమే. నిబద్ధత, అంకిత భావం, నమ్మకం, నిజాయితీలతో రాజుని ముగ్ధుణ్ని చేసి... ఆ శత్రు రాజ్యం లోంచే జెరూసలేం గోడకు అవసరమైన సరుకు, వస్తుసామాగ్రిని కూడా తీసుకొని జెరూసలేం బయలుదేరాడు నెహెమ్యా.
 
అక్కడికి వెళ్లేసరికి యూదులంతా నిరాశ, నిస్సృహలతో కనిపించారు నెహెమ్యాకి. అంతా ఐకమత్యంగా కాక ఎవరికి వారే అన్నచందంగా ఉన్నారు. వాళ్లందరినీ కూడగట్టి, ఒక్క తాటిమీదకు తెచ్చి జెరూసలేం గోడ కట్టించడం అతని వల ్లకాలేదు. అప్పుడు సమష్టి కృషిపై కాకుండా వ్యక్తి సామర్థ్యం మీద దృష్టి పెట్టాడు. పనిని వ్యక్తికింత చొప్పున విభ జించాడు. ప్రతి యూదుడి దగ్గరకు వెళ్లి ఎంత గోడ కట్టాలో వివరించాడు. ఇంటి దగ్గర్నుంచే గోడ కట్టడం మొదలుపెట్టమని సూచించాడు.

దానికి అవసరమైన సరుకు, వస్తుసామాగ్రిని అందించాడు. అలా అందరికీ పనిని అప్పగించాడు. నెహెమ్యా అంచనా తప్పు కాలేదు. ఆయన ఊహించి నట్టే వాళ్లంతా ఆ పనిలో పడ్డారు. నెహెమ్యా అనుకున్నట్టే గోడను 52 రోజుల్లో పూర్తి చేశారు. టీమ్‌వర్క్ సాధ్యం కాక పోతే స్వతంత్ర వ్యక్తులుగా భాగ స్వామ్యం ఇచ్చి కూడా అనుకున్న సమయంలో పని పూర్తి చేయొచ్చని నిరూపించాడు నెహెమ్యా!
 
బైబిల్ పాఠం - 2 : సర్వెంట్ లీడర్‌షిప్
మేనేజ్‌మెంట్ ప్రిన్సిపుల్స్‌లో సర్వెంట్ లీడర్‌షిప్ సూత్రాన్ని అనుసరించి ఎందరో నాయకులు అద్భుతమైన ఫలితాలను అందుకున్నారు. దీనికి ఆధారం మళ్లీ బైబిలే. సంప్రదాయ నాయకత్వం అధి కారాన్ని అనుభవిస్తుంది. కానీ సర్వెంట్ లీడర్‌షిప్ అధికారాన్ని విభజిస్తుంది. పెత్తనం చేయకుండా తన జట్టులోని సభ్యులకు సహకారం అందిస్తుంది.

ఇందులో అధికారి కన్నా కిందున్న వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అధికారి అప్పగించిన పనిని వాళ్లు సకాలంలో పూర్తి చేయడానికి కావల్సిన సౌకర్యాలు, సహాయసహకారాలు అందిస్తూ ఉంటాడు.  క్రీస్తు ఈ విషయం మీదే దృష్టిపెట్టాడు. ‘అధికారం కావాలనుకున్నవాడు ముందు సేవకుడిగా మారాలి’ అన్నాడు. చేసి చూపించాడు. శిష్యుల కాళ్లు కడిగాడు. 5 వేల మందికి భోజనం ఏర్పాటు చేశాడు. అంటరాని వాళ్లుగా ముద్రపడ్డ కుష్టులను ప్రేమించాడు.
 
నాయకత్వానికి, వ్యాపార నిర్వ హణకు బైబిల్ అందించిన రెండు చక్కటి ఉదాహరణలివి. ఈ లక్షణాలున్న  నాయకుడు వ్యక్తిగా, జట్టుగా చాలా ప్రభా వాన్ని చూపిస్తాడు. గాంధీ, మండేలా, లింకన్, మదర్‌థెరిసా వంటివారు ఆ సత్యాన్ని నిరూపించారు కూడా.          
- పీటర్ పాల్
గ్రాడ్యుయేట్ స్టూడెంట్ బోర్డ్ అధ్యక్షులు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement