బుల్లెట్లను ఎదురించి ప్రాణాలను కాపాడిన బైబిల్!
Published Tue, Feb 25 2014 3:48 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM
పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి శరీరంలోకి బుల్లెట్ దించితే ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. కాని రెండు సార్లు పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి ఛాతిలోకి బుల్లెట్లతో కాల్పులు జరిపినా బైబిల్ అడ్డుకోవడంతో ఓ వ్యక్తి సురక్షితం బయటపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అమెరికాలోని ఒహియోలో బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్న రికీ వాగనెర్ పై దుండుగులు అతి సమీపం నుంచి చాతిలోకి కాల్పులు జరిపారు.
అయితే బుల్లెట్లను తన పాకెట్ లో ఉన్న 'ది మెస్సె జ్' పేరుతో ఉన్న బైబిల్ ప్రాణాలను కాపాడింది. లేకుంటే ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసిపోయేవని పోలీసులకు రికీ ఫిర్యాదు చేశారు. రికీని టార్గెట్ చేసుకుని కొందరు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనపై పలు మీడియా సంస్థలు ఆశ్చర్యానికి గురికావడమే కాకుండా ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి. తాను రచించిన బైబిల్ బుల్లెట్లను అడ్డుకుందనే వార్తను విన్న రచయిత యూజిన్ హెచ్ పీటర్సన్ థ్రిల్ కు గురయ్యారు.
Advertisement
Advertisement