ఆకాశంలో కనిపించిన శాటిలైట్ల వరుస
Straight Line Of Stars In The Sky, శివమొగ్గ: ఆకాశంలో దూరదూరంగా దర్శనమిచ్చే నక్షత్రాలు ఒకే వరుసలో రైలులా వెళ్తున్నట్లు కనిపించడంతో శివమొగ్గవాసులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. సోమవారం రాత్రి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ ఆకాశ వింత కనువిందు చేసింది. దీంతో తమ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీసి మురిసిపోయారు. అవి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తరువాత తెలిసింది ఏమిటంటే అమెరికాకు చెందిన స్టార్‌లింక్ సంస్థ ప్రయోగించిన ఉపగ్రహాలు ఇలా ఆకాశంలో సంచరిస్తున్నట్లు తెలిసి ఔరా అనుకున్నారు. ప్రపంచంలో ప్రతి మూలకూ ఇంటర్నెట్ వసతిని అందించడానికి ఆ సంస్థ ఇటీవల సుమారు 52 శాటిలైట్లను ఒకే వరుసగా అమర్చి ప్రయోగించింది. ఇవి ప్రపంచంలో అన్ని దేశాల మీదుగా సంచరిస్తూ ఉంటాయి. భూమి మీద నుంచి సుమారు 580 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. ఏదేమైనా ఈ శాటిలైట్ కొన్ని గంటలపాటు అందరిలో కుతూహలాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment