న్యూయార్క్: ఫొటోలో చక్రంలా తిరుగుతూ కనువిందు చేస్తున్నది ఓ అందమైన తారా మండలం. దాని చుట్టూ ఆనంద తాండవం చేస్తున్నట్టు కన్పిస్తున్నవి భారీ నక్షత్రాలు! లెడా 2046648గా పిలుస్తున్న ఈ నక్షత్ర మండలం భూమికి ఏకంగా వంద కోట్ల కాంతి సంవత్సరాలకు పైగా దూరంలో హెర్క్యులస్ నక్షత్రరాశిలో ఉందట! దీన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవలే తన అత్యాధునిక నియర్–ఇన్‌ఫ్రా రెడ్ కెమెరా (ఎన్‌ఐఆర్ కామ్) సాయంతో బంధించింది.
మరుగుజ్జు తారగా మారిన డబ్ల్యూడీ1657ను పరిశీలిస్తున్న క్రమంలో యాదృచ్ఛికంగా ఈ గెలాక్సీ కంటబడిందని నాసా పేర్కొంది. ‘‘విశ్వావిర్భావపు తొలినాళ్లకు చెందిన సుదూర గెలాక్సీలను కనిపెట్టడం, పరిశోధించడమే ప్రధాన లక్ష్యంగా జేమ్స్ వెబ్‌ను తయారు చేయడం తెలిసిందే. ఆయా గెలాక్సీల రసాయనిక కూర్పు తదితరాలను కూడా విశ్లేషించగల సామర్థ్యం దాని సొంతం. తద్వారా వాటి ఆవిర్భావానికి కారణమైన భారీ మూలకాలు ఎలా పుట్టుకొచ్చిందీ తెలిసే ఆస్కారముంటుంది’’ అని ఒక ప్రకటనలో వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment