constellation
-
'నామినేషన్లకు' ఎప్పుడెలా ఉందో.. కాస్త చూసి చెప్పండి! పురోహితుల వెంట..
సాక్షి, కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. మంచి రోజు, బలమైన ముహూర్తం చూడాలని పండితులను సంప్రదిస్తున్నారు. ఈనెల 3నుంచి నామినేషన్ల ప్రక్రియం ప్రారంభమైంది. పదోతేదీ వరకు నామినేషన్ల ప్రక్రియకు తుది గడువు ఉంది. ఇంకా ఐదురోజులు మాత్రమే నామినేషన్లకు ముహూర్తం ఉంది. ఏ రోజు, ఏసమయం బాగుందో చూసి చెప్పండి అంటూ పురోహితుల వెంట తిరుగుతూ... బీఫాంలు అందుకున్న అభ్యర్థులు తమ జాతకాలను పరిశీలించుకుంటున్నారు. ఏ రోజు ఎలాగుందంటే..? నామినేషన్ల దాఖలు గడువుకు ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అభ్యర్థి జన్మనక్షత్రం ప్రకారం అనువైన తిథి, నక్షత్రం ఆధారంగా ముహూర్తం చూసుకుని నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు పురోహితులను కలుస్తున్నారు. ► 6వ తేదీ నవమి. అశ్లేష నక్షత్రం నామినేషన్ల దాఖలుకు ఇష్టపడరని పండితులు చెబుతున్నారు. ► 7న మంగళవారం కావడంతో చాలా మంది నామినేషన్ వేయరంటున్నారు. ► 8న ఏకాదశి, పుష్పనక్షత్రం కావడంతో ఎక్కువ మంది నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ► 9న ఏకాదశి ఉదయం 10.30 వరకు ఉండడంతో నామినేషన్లు అధికంగా దాఖలు కావొచ్చని చెబుతున్నారు. ► 10న రాహుకాలం అధికంగా ఉండడంతో నామినేషన్లు పెద్దగా దాఖలు కాకపోవచ్చు. ఇవి చదవండి: కడుపేద వర్గాలకు చేరువైన 'సీపీఐ..' ఇకపై ప్రశ్నార్థకమేనా!? -
కృష్ణ ‘చక్రం’
కృష్ణ బిలాల అధ్యయనంలో కీలక మలుపు. గెలాక్సీ ఎం87లో ఉన్న అతి భారీ కృష్ణబిలం ఒకటి భూచక్రం మాదిరిగా వర్తులాకారంలో గిరగిరా తిరుగుతోంది. ఇది మనకు 5.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో కన్యా నక్షత్ర రాశిలో ఉంది. దీనికి సంబంధించి రెండు దశాబ్దాల పాటు సేకరించిన డేటాను అధ్యయనం చేసిన మీదట సైంటిస్టులకు ఈ విశేషం చిక్కింది. అందులో భాగంగా ఈ కృష్ణబిలానికి సంబంధించి నాలుగేళ్ల క్రితం ఈవెంట్ హోరైజాన్ టెలీస్కోప్ తీసిన ఫొటోను అధ్యయనం చేసి, అది నిలువుగానూ, పక్కలకూ గిరగిరా తిరుగుతోందని తేల్చారు. ఇలా తేలడం ఇదే మొదటిసారి. కృష్ణ బిలాల అధ్యయనంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ► కృష్ణ బిలం సమీపానికి వచి్చన ప్రతి వస్తూ రాశినీ దాని తాలూకు డిస్క్ లోనికి లాక్కునే క్రమంలో ఇలా తిరుగుతోందట. ► ఇది అచ్చం సౌర వ్యవస్థలోని గురుత్వాకర్షణ బలాల కలయిక తదితరాల ప్రభావంతో భూమి భ్రమణం, పరిభ్రమణం చేస్తున్న తీరును పోలి ఉందట. ► ఈ సరికొత్త సమాచారం చాలా థ్రిల్లింగ్ గా ఉందని దీనిపై సమరి్పంచిన అధ్యయన పత్రానికి లీడ్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ యుజూ కుయ్ చెప్పుకొచ్చారు. ► ప్రపంచవ్యాప్తంగా 45 అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధకులతో కూడిన బృందం నాలుగేళ్ల పాటు ఈ అంశంపై లోతుగా పరిశోధించింది. తెలిసింది గోరంతే ► అత్యంత భారీగా ఉండే కృష్ణబిలాల అధ్యయనం చాలా కష్టం. ► ఎందుకంటే అవి కాంతితో సహా అన్నింటినీ తమలోకి లాగేసుకుంటాయి. ► వీటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు అందుబాటులో ఉన్న సమాచారం కూడా చాలా స్వల్పం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
NASA: తారల తాండవం!
న్యూయార్క్: ఫొటోలో చక్రంలా తిరుగుతూ కనువిందు చేస్తున్నది ఓ అందమైన తారా మండలం. దాని చుట్టూ ఆనంద తాండవం చేస్తున్నట్టు కన్పిస్తున్నవి భారీ నక్షత్రాలు! లెడా 2046648గా పిలుస్తున్న ఈ నక్షత్ర మండలం భూమికి ఏకంగా వంద కోట్ల కాంతి సంవత్సరాలకు పైగా దూరంలో హెర్క్యులస్ నక్షత్రరాశిలో ఉందట! దీన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవలే తన అత్యాధునిక నియర్–ఇన్ఫ్రా రెడ్ కెమెరా (ఎన్ఐఆర్ కామ్) సాయంతో బంధించింది. మరుగుజ్జు తారగా మారిన డబ్ల్యూడీ1657ను పరిశీలిస్తున్న క్రమంలో యాదృచ్ఛికంగా ఈ గెలాక్సీ కంటబడిందని నాసా పేర్కొంది. ‘‘విశ్వావిర్భావపు తొలినాళ్లకు చెందిన సుదూర గెలాక్సీలను కనిపెట్టడం, పరిశోధించడమే ప్రధాన లక్ష్యంగా జేమ్స్ వెబ్‌ను తయారు చేయడం తెలిసిందే. ఆయా గెలాక్సీల రసాయనిక కూర్పు తదితరాలను కూడా విశ్లేషించగల సామర్థ్యం దాని సొంతం. తద్వారా వాటి ఆవిర్భావానికి కారణమైన భారీ మూలకాలు ఎలా పుట్టుకొచ్చిందీ తెలిసే ఆస్కారముంటుంది’’ అని ఒక ప్రకటనలో వివరించింది. -
సృష్టి స్తంభాలు కరుగుతున్నాయి!
అతిశీతల నక్షత్ర ధూళి, నక్షత్రమండలం, హబుల్ అంతరిక్ష టెలిస్కోపు నక్షత్రాలకు జన్మనిచ్చే అతిశీతల నక్షత్ర ధూళి మేఘాలివి. మనకు 7 వేల కాంతి సంవత్సరాల దూరంలోని సెర్పెన్స్(పాము) నక్షత్రమండలంలో ఉన్నాయి. ఈగల్ నెబ్యులా (నక్షత్ర ధూళి మేఘాల సమూహం)లో భాగంగా ఉన్న ఈ సృష్టి స్తంభాలను అమెరికా, ఐరోపా అంతరిక్ష సంస్థలు నాసా, ఈసాలకు చెందిన హబుల్ అంతరిక్ష టెలిస్కోపు తొలిసారిగా 1995లో ఫొటోలు తీసిం ది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఇటీవల మరోసారి ఫొటోలు తీసింది. దీంతో ఈ సృష్టి స్తంభాలు కొన్నిచోట్ల కరుగుతున్నాయని వెల్లడైంది. హైడ్రోజన్, హీలియం వాయువులు, ధూళితో తారలను సృష్టించే స్తంభాల్లా ఉన్నం దున వీటికి ‘పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్’ అని పేరు పెట్టారు. అయితే, కొత్తగా పుట్టిన నక్షత్రాల వేడి వల్ల వీటిలోని వాయువులు వేడెక్కి.. ఆవిరై అంతరిక్షంలోకి విడుదలవుతున్నాయని తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించారు.