
కృష్ణ బిలాల అధ్యయనంలో కీలక మలుపు. గెలాక్సీ ఎం87లో ఉన్న అతి భారీ కృష్ణబిలం ఒకటి భూచక్రం మాదిరిగా వర్తులాకారంలో గిరగిరా తిరుగుతోంది. ఇది మనకు 5.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో కన్యా నక్షత్ర రాశిలో ఉంది. దీనికి సంబంధించి రెండు దశాబ్దాల పాటు సేకరించిన డేటాను అధ్యయనం చేసిన మీదట సైంటిస్టులకు ఈ విశేషం చిక్కింది. అందులో భాగంగా ఈ కృష్ణబిలానికి సంబంధించి నాలుగేళ్ల క్రితం ఈవెంట్ హోరైజాన్ టెలీస్కోప్ తీసిన ఫొటోను అధ్యయనం చేసి, అది నిలువుగానూ, పక్కలకూ గిరగిరా తిరుగుతోందని తేల్చారు. ఇలా తేలడం ఇదే మొదటిసారి. కృష్ణ బిలాల అధ్యయనంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
► కృష్ణ బిలం సమీపానికి వచి్చన ప్రతి వస్తూ రాశినీ దాని తాలూకు డిస్క్ లోనికి లాక్కునే క్రమంలో ఇలా తిరుగుతోందట.
► ఇది అచ్చం సౌర వ్యవస్థలోని గురుత్వాకర్షణ బలాల కలయిక తదితరాల ప్రభావంతో భూమి భ్రమణం, పరిభ్రమణం చేస్తున్న తీరును పోలి ఉందట.
► ఈ సరికొత్త సమాచారం చాలా థ్రిల్లింగ్ గా ఉందని దీనిపై సమరి్పంచిన అధ్యయన పత్రానికి లీడ్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ యుజూ కుయ్ చెప్పుకొచ్చారు.
► ప్రపంచవ్యాప్తంగా 45 అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధకులతో కూడిన బృందం నాలుగేళ్ల పాటు ఈ అంశంపై లోతుగా పరిశోధించింది.
తెలిసింది గోరంతే
► అత్యంత భారీగా ఉండే కృష్ణబిలాల అధ్యయనం చాలా కష్టం.
► ఎందుకంటే అవి కాంతితో సహా అన్నింటినీ తమలోకి లాగేసుకుంటాయి.
► వీటికి సంబంధించి ఇప్పటిదాకా మనకు అందుబాటులో ఉన్న సమాచారం కూడా చాలా స్వల్పం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment