17 వలయాలతో వయ్యారాలు పోతున్న జంట తారలివి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వీటిని తాజాగా గుర్తించింది. ఎనిమిదేళ్లకోసారి అవి పరస్పరం సమీపంగా వచ్చినప్పుడల్లా రెండింటి వాయు ప్రవాహాలతో రేగే అంతరిక్ష ధూళి ఇలా వలయాల రూపు సంతరించుకుంటోందట. దీన్ని రోదసిలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్‌గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.
భూమి నుంచి 50 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ జంట తారలను వూల్ఫ్–రాయెట్ 140గా వ్యవహరిస్తున్నారు. వీటిలో ఒకటి సూర్యుని కంటే కనీసం 25 రెట్లు పెద్దదట. దాని జీవితకాలం ముగింపుకు వస్తోందని నాసా తెలిపింది. అది నెమ్మదిగా కృశించి బ్లాక్‌హోల్‌గా మారడానికి ఎంతోకాలం పట్టదని చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment