
బాలీవుడ్ స్టార్లు షాకయ్యారు!
ముంబై: తాజాగా సంభవించిన భూకంపంతో బాలీవుడ్ స్టార్లు దిగ్భ్రాంతి చెందారు. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌తోపాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న భూకంపం ప్రభావాన్ని తాము కూడా ఎదుర్కొన్నమంటూ పలువురు సినీతారలు పేర్కొన్నారు. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. బాలీవుడ్ సెలెబ్రిటీలు వివేక్ ఒబ్రరాయ్, ప్రీతి జింతా, రణ్‌వీర్ షోరెయ్, అలీ జఫర్ తదితరులు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఈ విషయమై స్పందించారు. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో నమోదైన భూకంపం ఘటనపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరేమన్నారంటే..
వివేక్ ఒబెరాయ్: అహ్మదాబాద్‌లో ఇప్పుడే భూకంపాన్ని చవిచూశా. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఆశిస్తున్నా. మేమున్న హోటల్ మొత్తం ఊగిపోయింది.
అలీ జఫర్: నాకు అనుభవంలోకి వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపం ఇది.
రణ్‌వీర్ షోరెయ్: భూకంపం ప్రభావ ప్రాంతాల్లో ఉన్నవారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నా. సురక్షితంగా ఉండండి.
అద్నాన్ సమీ: భూకంపం వల్ల ప్రభావితమైన వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. దేవుడి సంరక్షణలో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా.
ప్రీతిజింతా: ఓ మై గాడ్: భూకంపం వచ్చింది.
నెహా ధూపియా: భూకంపం గురించి వార్తలు వస్తున్నాయి. చాలా ఆందోళనగా ఉంది. మీరు, మీ ఆప్తులు అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నా.