
తెలుగులో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ రెజీనా.. మన దేశ పార్లమెంట్ లోకి వెళ్లింది.

డెమోక్రటిక్ సంఘా పేరుతో నడుపుతున్న స్వచ్ఛంద సంస్థలో ఈమె పనిచేస్తోంది.

ఈ సంస్థలోని తొలి బ్యాచ్ విద్యార్థులని తీసుకుని రెజీనా.. పార్లమెంట్ సందర్శనకు వెళ్లింది.

భారత పార్లమెంట్ అంతర్గత పనితీరు వీక్షించడంతో పాటు ప్రజాస్వామ్య పాలన, శాసన ప్రక్రియల గురించి తెలుసుకున్నారు.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు సంఘ్ పనిచేస్తూనే ఉంటుందని రెజీనా చెప్పుకొచ్చింది.




