అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి అన్షు అంబాని అందరికి గుర్తుండే ఉంటుంది. అదేనండి ‘గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తుంది.. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది’.. అంటూ కింగ్‌తో కలిసి ఆడిపాడారు అన్షు. విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి సినిమాతో ఎందరో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ప్రభాస్‌కు జంటగా ‘రాఘవేంద్ర’లో నటించారు. అనంతరం 2004లో వచ్చిన మిస్సమ్మలో గెస్ట్ రోల్ పోషించిన అన్షు తరువాత మరే ఇతర చిత్రంలోనూ కనిపించలేదు. 2003లో లండన్‌కు చెందిన సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరికి ఓ పాప ఉన్నారు.
తాజాగా అన్షు మళ్లీ సినిమాల్లోకి రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత అన్షు అంబానీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అన్షు కీలక పాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్షును చిత్ర యూనిట్ సంప్రదించగా ఇందుకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే అలనాటి ముద్దుగుమ్మను మళ్లీ వెండితెరపైకి చూసుకోవచ్చు. #NTR30గా రూపొందనున్నఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కాగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం తరువాత ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు.
చదవండి: సుస్మితతో పెళ్లి.. ప్రియుడి కామెంట్
చదవండి: ‘చావుకబురు చల్లగా’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
Comments
Please login to add a commentAdd a comment