Producer Naga Vamshi Clarifies On Jr NTR And Trivikram Srinivas New Movie - Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌‌న్యూస్‌, ఆ వార్తల్లో నిజం లేదు

Published Wed, Apr 7 2021 12:30 PM | Last Updated on Wed, Apr 7 2021 1:21 PM

Producer Naga Vamsi Clarifies On Jr NTR And Trivikram New Project - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌-ఎన్టీఆర్‌ల కొత్త ప్రాజెక్ట్ వాయిదా పడిందంటూ వస్తున్న వార్తలపై నిజం లేదంటూ తాజాగా నిర్మాత నాగ వంశీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ 30వ సినిమాను త్రివిక్రమ్‌తో చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చియి. అయితే ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించి రోజులు గడుస్తున్న దీనిపై తదుపరి అప్‌డేట్‌ రాకపోవడంతో ఈ సినిమా వాయిదా పడినట్లు వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

అంతేగాక ఈ సినిమా స్క్రిప్ట్‌పై ఎన్టీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా కథనాలు వినిపించాయి. దీంతో ఈ మూవీ నిర్మాత నాగవంశీ ఈ పుకార్లకు చెక్‌ పెట్టాడు. ‘ఇది చాలా మంచి జోక్ గాయ్స్‌’ అంటూ తనదైన శైలిలో క్యాప్షన్‌ ఇస్తూ ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఎన్టీఆర్‌ అభిమానులంతా మరోసారి సంబరాల్లో మునిగిపోయారు. త్రివిక్రమ్ పాటించే ‘అ’ అక్షరం సెంటిమెంట్‌తో ఈ సినిమాకు ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా అన్ని పరిస్థితులు అనుకులంగా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ షూటింగ్‌ పూర్తికాగానే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం.

చదవండి: 
ఆ విషయంలో ఎన్టీఆర్‌ అసంతృప్తి.. త్రివిక్రమ్‌ మూవీకి బ్రేక్‌! 
ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ఎన్టీఆర్‌ మూవీ..?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement