Actress Anshu Latest Photos: Reason Behind She Left Movies - Sakshi
Sakshi News home page

Guess The Actress: కేవలం రెండే సినిమాలు.. ఆ కారణంతో టాలీవుడ్‌కి దూరం!

Jul 31 2023 3:52 PM | Updated on Jul 31 2023 4:10 PM

Actress Anshu Latest Photos Reason Behind Left Movies - Sakshi

ఈ హీరోయిన్ పుట్టింది లండన్‌లో.. కానీ హీరోయిన్ కావాలనుకుంది. అలా ప్రయత్నం చేసి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్, నాగార్జున లాంటి హీరోలతో నటించింది. వీటిలో ఒకటి ఇండస్ట్రీలో బెస్ట్ ఫిల్మ్ కాగా, మరొకటి యావరేజ్‌గా నిలిచింది. వీటి తర్వాత ఈమెకు ఛాన్సులు వచ్చాయి గానీ ఒకే ఒక్క కారణంతో యాక్టింగ్‌కి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ ఎవరీ బ్యూటీ? ఈమె స్టోరీ ఏంటి?

(ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!)

సాధారణంగా హీరోయిన్లకు వయసు పెరిగేకొద్ది గ్లామర్ తగ్గుతుంది. అదేంటో ఈమెకు మాత్రం అది రివర్స్‌లో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. లేకపోతే 40 ఏళ్లు వయసు, ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ యంగ్ హీరోయిన్లు పోటీ ఇచ్చేలా తయారైంది. ఇంతకీ ఈమె పేరు చెప్పలేదు కదు. అన్షు అంబానీ. ఇప్పటికీ గుర్తురాలేదా? 'మన్మథుడు' ఫ్లాష్‪‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో కనిపించే హీరోయిన్ ఈమెనే.

ఇక ఈమె పేరు అన‍్షు అంబానీ. భారతీయ మూలాలున్న ఈ బ్యూటీ లండన్‌లో పుట్టి పెరిగింది. చదువుతున్నప్పుడే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో హీరోయిన్ అవుదామనుకుంది. దీంతో ప్రయత్నాలు చేసింది. అలా ప్రభాస్ కెరీర్ మొదట్లో చేసిన 'రాఘవేంద్ర' సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇది షూటింగ్ పూర్తి చేసుకునేలోపు, నాగార‍్జున 'మన్మథుడు'లో ఈమె ఓ హీరోయిన్‌గా చేసింది.

(ఇదీ చదవండి: ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!)

ఇలా తెలుగులో కేవలం రెండంటే రెండు సినిమాలు చేసింది. 'మిస్సమ్మ' చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. తమిళంలో 'జై' అనే మూవీ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు పలు చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. కానీ ఈమె వాటిని అంగీకరించలేదు. తిరిగి లండన్ ఫ్లైట్ ఎక్కేసింది. దీనికి కారణం ఏంటా అని చూస్తే.. సినిమాలు చేద్దామనే ఇంట్రెస్ట్ ఉంది గానీ కేవలం ఒకటి రెండు అని ముందే ఫిక్స్ అయిందట. అలా తన డ్రీమ్ నెరవేరగానే ఇంటికెళ్లిపోయింది.

ఇక లండన్‌కి వెళ్లిపోయిన అన్షు.. సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండియన్ డిజైనర్ వేర్ బిజినెస్ చేస్తూ బిజీగా ఉంది. ఫ్రీ టైంలో జిమ్ వర్కౌట్ వీడియోలు, గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఒకప్పటి క్యూట్‌గా ఉండే ఈమె ఇప్పుడు 40ల్లోనూ హాట్‌గా కనిపిస్తూ ఆశ‍్చర్యపరుస్తోంది. మరి ఈమెని చూడగానే మీలో ఎవరైనా గుర్తుపట్టారా? లేదా ఇదంతా చదివిన తర్వాత గుర్తుపట్టారా?

(ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ‍్యాగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement