అన్షు అంబానీ.. చేసింది నాలుగే నాలుగు సినిమాలు.. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్‌లో గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికీ ఆమెను తెలుగు ఆడియన్స్ ఇట్టే గుర్తుపడతారు. తను నటించిన తొలి చిత్రం మన్మథుడు. ఈ మూవీ అటు నాగార్జునకు, ఇటు అన్షుకు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ మరుసటి ఏడాదే రాఘవేంద్ర సినిమా చేసిందీ బ్యూటీ. మిస్సమ్మలో అతిథి పాత్రలో మెరిసింది. 2004లో జై అనే తమిళ చిత్రంలో చివరిసారిగా నటించింది. తర్వాత మరే సినిమా ఒప్పుకోలేదు. 2003లో సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లాడి లండన్‌లో సెటిలైంది. తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఇరవై ఏండ్ల తర్వాత ఈమె మీడియా ముందుకు వచ్చింది.
16 ఏళ్ల వయసులోనే..
తాజాగా ఏదో పని మీద భారత్‌కు వచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో తను సినిమాలు మానేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది. అన్షు మాట్లాడుతూ.. నేను ఇంగ్లాండ్‌లో పుట్టి పెరిగాను, కానీ నా పూర్వీకులు భారతీయులే. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు ఇండియాకు వచ్చాను. అప్పుడే మన్మథుడు సినిమాలో ఆఫర్ వచ్చింది. ఓపక్క సినిమాల్లో యాక్టివ్ అవ్వాలనుకున్నా.. మరోవైపు చదువుపైనా దృష్టి పెట్టాలనుకున్నాను.
పదేపదే అలాంటి క్యారెక్టర్..
తెలుగులో చేసిన రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గానే ఛాన్స్ వచ్చింది. ఆ రెండింటిలోనూ నా పాత్ర చనిపోతుంది. ఆ తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాల్లో కూడా ఇలా చనిపోయే రోల్సే ఆఫర్ చేశారు. పదేపదే అలాంటి క్యారెక్టర్సే వస్తుండటంతో విసుగెత్తిపోయాను. ఇవి చేసే బదులు ఖాళీగా ఉండటం నయమనుకున్నాను. అందుకే సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోయాను. ఒక క్యారెక్టర్ బాగా చేశారని పదేపదే ఆ నటులను అదే పాత్రకు పరిమితం చేయడం కరెక్ట్ కాదు' అని చెప్పుకొచ్చింది అన్షు అంబానీ.
చదవండి: సహజీవనం వేస్ట్.. ఇద్దరు తప్పు చేసినా ఒక్కరికే శిక్ష!: పక్కింటి కుర్రాడు
Comments
Please login to add a commentAdd a comment