20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే! | Manmadhudu Actress Anshu Sagar Re Entry Into Tollywood | Sakshi
Sakshi News home page

Anshu Sagar: మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులోనే సినిమా చేయబోతుందా?

May 7 2024 3:54 PM | Updated on May 7 2024 6:41 PM

Manmadhudu Actress Anshu Sagar Re Entry Into Tollywood

'మన్మథుడు' సినిమా పేరు చెప్పగానే కామెడీ డైలాగ్స్ గుర్తొస్తాయి. అలానే హీరోయిన్ అన్షు కూడా జ్ఞాపకమొస్తుంది. ఎందుకంటే మూవీలో ఉన్నది కాసేపే అయినా తన అందంతో మెస్మరైజ్ చేసింది. అయితే మరిన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తుందని అనుకుంటే.. సడన్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. దేశమే వదిలేసి వెళ్లిపోయింది. అలాంటిది ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందట.

(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)

లండన్‌లో పుట్టి పెరిగిన అన్షు.. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంది. ఆ తర్వాత మోడలింగ్ చేసి, హీరోయిన్ అయిపోయింది. మన్మథుడు, రాఘవేంద్ర, మిస్సమ్మ సినిమాలు చేసింది. తమిళంలో మరో మూవీ చేసింది. హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే.. 2003లో సచిన్ నిగ్గర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తిరిగి లండన్ వెళ్లిపోయింది. యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది.

ఇక కొడుకు, కూతురు పుట్టారు. కొన్నాళ్ల పాటు గార్మెంట్ బిజినెస్ కూడా చేసింది. గత కొన్నేళ్ల నుంచి మళ్లీ గ్లామర్ చూపిస్తూ వచ్చింది. అలా గత కొన్నాళ్ల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటూ తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. అలా ఇప్పుడు సందీప్ కిషన్ కొత్త మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో రావు రమేశ్‌కి జోడీగా ఈమె కనిపించనుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. 

(ఇదీ చదవండి: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement