టాలీవుడ్ మన్మథుడు నాగార్జున మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. తన జనరేషన్ హీరోలందరూ రొమాంటిక్ సినిమాలకు గుడ్‌బై చెప్పేసినా నాగ్ మాత్రం ఇప్పటికీ మన్మథుడు ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. అదే బాటలో ఓ అరుదైన ఘనత సాధించాడు. తమ ఫ్యామిలీలో మరో జనరేషన్ హీరోలతో నటించిన హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ నాగ్ మాత్రం తకన్న ముందు జనరేషన్‌తో నటించిన హీరోయిన్లతో పాటు తన తరువాతి జనరేషన్‌తో నటించిన హీరోయిన్లతోనూ కలిసి నటిస్తున్నాడు.
అక్కినేని నాగేశ్వరరావుతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవితో నాగార్జున పలు సూపర్ హిట్ సినిమాలు చేశాడు. తాజాగా తన తనయుడు నాగచైతన్య సరసన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి నటిస్తున్నాడు నాగ్. అంటే తండ్రి సరసన హీరోయిన్‌గా చేసిన భామతో, కొడుకు సరసన హీరోయిన్‌గా చేసిన భామతోనూ కలిసి నటించిన అరుదైన రికార్డ్‌ను సాధించాడు కింగ్. ప్రస్తుతం చిత్రకరణ జరుపుకుంటున్న మన్మథుడు 2లో నాగ్, రకుల్ జంటగా నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment