
చిన్న సినిమాలతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఎంత వేగంగా స్టార్ ఇమేజ్ సాధించిందో అదే వేగంగా తన ఫాం కోల్పోయింది ఈ భామ. 2016లో ధృవ సినిమాతో చివరగా బిగ్ హిట్ అందుకున్న రకుల్ తరువాత టాలీవుడ్ లో ఒక్క ఘనవిజయం కూడా సాధించలేకపోయింది. దీంతో ఈ అమ్మడి కెరీర్ కష్టాల్లో పడింది. అదే సమయంలో తమిళ, హిందీ ఇండస్ట్రీల మీద దృష్టి పెట్టడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.
ఇతర ఇండస్ట్రీలలో కూడా ఆశించిన స్థాయి సక్సెస్‌లు దక్కకపోవటంతో రకుల్ తిరిగి టాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉండటంతో రకుల్ ఇక్కడ ఆఫర్లు తగ్గాయి. దీంతో టాలీవుడ్‌లో తిరిగి ప్రూవ్ చేసుకునేందుకు సీనియర్ల సరసన నటించేందుకు కూడా ఓకె అంటుందట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న మన్మథుడు 2లో నాగార్జున సరసన నటించేందుకు రకుల్ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అయినా రకుల్ తిరిగి ఫాంలోకి వస్తుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment