పాయల్‌ ఎక్స్‌ప్రెస్‌ | Payal Rajput Readying up for Manmadhudu 2 | Sakshi
Sakshi News home page

పాయల్‌ ఎక్స్‌ప్రెస్‌

Published Tue, Feb 19 2019 3:03 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Payal Rajput Readying up for Manmadhudu 2 - Sakshi

పాయల్‌ రాజ్‌పుత్‌

‘‘ఆర్‌ఎక్స్‌ 100’ సూపర్‌ సక్సెస్‌తో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయారు పాయల్‌ రాజ్‌పుత్‌. మొదటి సినిమాలోనే బోల్డ్‌గా నటించి ఇండస్ట్రీ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారామె. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు సైన్‌ చేస్తారనుకుంటే కొంచెం సమయం తీసుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలకు సంతకాలు చేస్తున్నారు. మొదట రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒక హీరోయిన్‌గా ఎంపికయ్యారు. లేటెస్ట్‌గా నాగార్జున ‘మన్మథుడు 2’ , వెంకటేశ్‌ ‘వెంకీ మామ’లో హీరోయిన్‌గా కమిట్‌ అయ్యారీ బోల్డ్‌ బ్యూటీ. ఇలా టాప్‌ హీరోలు ముగ్గురితో సినిమాలు సంతకం చేసి బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు సక్సెస్‌ అయితే పాయల్‌ టాప్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఈజీ అనుకోవచ్చు. ప్రస్తుతం తమిళంలో ఉదయ్‌ నిధి స్టాలిన్‌తో ‘ఏంజిల్‌’ అనే సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement