
‘‘మజాకా’(Mazaka) సినిమా కోసం నెల రోజులుగా పగలు, రాత్రి చిత్రీకరణ చేస్తున్నాం. ఈ మూవీ కోసం మేము క్రియేటివ్‌గా ప్రమోషన్స్ చేయాలని భావించాం. అందులో భాగంగా ఔట్‌డోర్‌లో జరుగుతున్న మా సినిమా షూటింగ్‌కి మీడియా వారు వచ్చినందుకు థ్యాంక్స్. ఈ నెల 26న ‘మజాకా’ చిత్రంతో పెద్ద హిట్ కొడుతున్నామనే నమ్మకం ఉంది’’ అని సందీప్ కిషన్ తెలిపారు.
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్(Sundeep Kishan), రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శివరాత్రి కానుకగా ఈ నెల 26న విడుదల కానుంది. కాగా ఈ మూవీలోని ‘రావులమ్మ..’ అంటూ సాగే పాట చిత్రీకరణ షూటింగ్ ప్రస్తుతం ఔట్‌డోర్‌లో జరుగుతోంది.
ఈ షూటింగ్‌ని లైవ్ ద్వారా ప్రేక్షకులకు చూపించారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ–‘‘రావులమ్మ’ ఫుల్ మాస్ అండ్ ఫోక్ సాంగ్. సందీప్, రీతు అద్భుతమైన డ్యాన్స్‌తో ఇరగదీశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డాం’’ అని చెప్పారు రీతూ వర్మ. ‘‘మజాకా’తో ఈసారి మళ్లీ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘మా బ్యానర్‌లో ఇది బెస్ట్ సినిమా అని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు రాజేష్ దండా. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment