డైలాగ్స్‌ లేకుండా విజయ్‌ సేతుపతి ‘గాంధీ టాక్స్‌’, ఆసక్తిగా ఫస్ట్‌గ్లింప్స్‌ | Vijay Sethupathi, Arvind Swami Gandhi Talks First Glimpse Release | Sakshi
Sakshi News home page

Vijay Sethupathi ‘Gandhi Talks’: డైలాగ్స్‌ లేకుండా విజయ్‌ సేతుపతి ‘గాంధీ టాక్స్‌’, ఆసక్తిగా ఫస్ట్‌గ్లింప్స్‌

Published Mon, Oct 3 2022 9:18 AM | Last Updated on Mon, Oct 3 2022 9:32 AM

Vijay Sethupathi, Arvind Swami Gandhi Talks First Glimpse Release - Sakshi

ప్రయోగాత్మక చిత్రాల్లో నటించే హీరోల్లో ముందువరుసలో ఉంటారు విజయ్‌ సేతుపతి. తాజాగా ఆయన ‘గాంధీ టాక్స్‌’ అనే సైలెంట్‌ ఫిల్మ్‌(డైలాగులు లేని)లో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. మరాఠి దర్శకుడు కిశోర్‌ పాండురంగ్‌ బేలేకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అరవింద్‌ స్వామి, అదితీరావ్‌ హైదరీ, సిద్ధార్థ్‌ జాదవ్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

చదవండి: మహేశ్‌-త్రివిక్రమ్‌ చిత్రంలో మలయాళ స్టార్‌ హీరో!

కాగా ఆదివారం గాంధీ జయంతి (అక్టోబరు 2) సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్‌. ‘‘డైలాగ్స్‌ లేకుండా కేవలం ఎమోషన్స్‌తోనే కథను చెప్పడం అంత సులువైన విషయం కాదు. ఈ సినిమా నాకు చాలెంజింగ్‌గా అనిపించింది’’ అని కిశోర్‌ పాండురంగ్‌ బేలేకర్‌ అన్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement