
చార్మింగ్ నటుడు అరవిందస్వామి హీరోగా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కల్లపార్ట్ చిత్రం బుధవారం ఉదయం చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో ప్రారంభమైంది. ఇంతకు ముందు విక్రమ్, తమన్నా జంటగా స్కెచ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మూవింగ్ ప్రేమ్ సంస్థ అధినేతలు ఎస్.పార్తీ, ఎస్‌ఎస్.వాసన్ నిర్మిస్తున్న తా జా చిత్రం ఈ కల్లపార్ట్.
ఈ సినిమాలో అరవిందస్వామికి జంటగా రెజీనా నటిస్తోంది. ఎన్నమో నడక్కుదు, అచ్చమిండ్రి చిత్రాల ఫేమ్ రాజాపాండి దర్శకత్వం వహిస్తున్న మూవీలో ఆనందరాజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఏవీఎం స్టూడియోలో భారీ సెట్ వేశారు. ఈ సెట్‌లోనే భాగం చిత్రీకరించనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. చెన్నైలోనే 40 రోజులు షూటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment