హైదరాబాద్: సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా, విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. ‘తలైవి’ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘తలైవీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కంగనా రనౌత్, అరవింద్ స్వామి, విజయేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ..
కంగనా రనౌత్ : ‘ప్రొడ్యూసర్ విష్ణు సార్‌కి ఈ మూవీ బర్త్ డే గిఫ్ట్ అవుతుంది. మీరు ఎప్పటికీ గుర్తుంచుకునే బ్లాక్ బస్టర్ బర్త్ డే గిఫ్ట్ ఇదే అవుతుంది. థాంక్యూ వెరీ మచ్. నాకు తమిళం గురించి కానీ, ఇక్కడి రాజకీయాల గురించి కానీ ఏం తెలియదు. నేను ఈ పాత్రను పోషించగలను అని విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు మాత్రం నాకే వింతగా అనిపిస్తోందని’ అన్నారు.
అరవింద్ స్వామి: ‘ఎన్నో సినిమాల్లో నటించాను కానీ ఈ సినిమాలో భాగం కావడం చాలా అద్భుతమైన అనుభవం. ఈ సినిమాతో మీ అందరి ముందుకు రావడం ఆనందంగా ఉంది. విజయ్ సార్‌తో పాటు చిత్రయూనిట్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓ నటుడిగా ఈ సినిమాలో కంగనా లాంటి స్టార్లతో నటించి చాలా నేర్చుకున్నా. ఈ సినిమాను కంగనా తన భుజాలపై వేసుకొని నటించింది. రెండు రోజుల క్రితం ఈ సినిమా చూశా. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్ముతున్నానని తెలిపారు.
దర్శకుడు విజయ్: ‘తెలుగు ప్రేక్షకులంటే నాకు చాలా గౌరవం. వాళ్ళు సినిమాను ఎంతో ప్రేమిస్తారు. మా సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ కానుంది. అరవింద్ సార్ ఈ సినిమాకు బిగ్ పిల్లర్. జయలలిత క్యారెక్టర్‌లో కంగనా ఒదిగిపోయింది. ఆమెకు నేషనల్ అవార్డు రావడం ఖాయం. నేను 2000 సంవత్సరంలో కాలేజ్ పూర్తిచేసి విజయేంద్రప్రసాద్ గారి క్లాసులకు వెళ్లి ఆయనతో కూర్చొని స్టోరీలు రాస్తూ ఎన్నో నేర్చుకున్నా. చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment