Thalaivi Movie Updates: Kangana Ranaut & Arvind Swamy New Pictures Released From Thalaivi Movie - Sakshi
Sakshi News home page

తలైవి ఫస్ట్‌లుక్‌ విడుదల

Published Mon, Jan 18 2021 8:09 AM | Last Updated on Mon, Jan 18 2021 9:47 AM

Thalaivi First Look Released On MGR Birthday - Sakshi

జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. ఏ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ చేశారు. యంజీఆర్‌ పాత్రలో అరవింద్‌ స్వామి నటించారు. ఆదివారం యంజీఆర్‌ జయంతి. ఈ సందర్భంగా ‘తలైవి’లోని ఓ కొత్త స్టిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. యంజీఆర్‌ అద్భుతమైన నాయకులని, అలానే జయలలితకు ఆయన మార్గనిర్దేశకుడు అంటూ కంగనా తన ట్విటర్‌ ఖాతాలో ఫస్ట్‌లుక్‌ పంచుకున్నారు. అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన లుక్స్‌ అన్నింటికీ విశేష ఆదరణ లభిస్తోందని, ఇలానే సినిమాను కూడా ఆదరిస్తారనుకుంటున్నామని నిర్మాతలు విష్ణువర్ధన్, శైలేష్‌లు‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement