Kangana Ranaut Thalaivi Movie Release Date Confirmed - Sakshi
Sakshi News home page

Thalaivi Movie: విడుదల తేదీ ఫిక్స్‌, ఆ రోజునే విడుదల

Published Mon, Aug 23 2021 9:09 PM | Last Updated on Tue, Aug 24 2021 10:21 AM

Kangana Ranaut Thalaivi Movie Gets Release Date - Sakshi

Kangana Ranaut Thalaivi Movie Release Date: ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ‘తలైవి’ మూవీ విడుదల తేదీ వచ్చేసింది. గతేడాది రిలీజ్‌ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. చివరకు షూటింగ్‌ను పూర్తి చేసుకుని ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధంగా కాగా సెకండ్‌ వేవ్‌ కారణంగా థియేటర్లు మూత పడ్డాయి. దీంతో మళ్లీ సినిమా వాయిదా పడింది.  దివంగత ముఖ్యమంత్రి జయలలీత బయోపిక్‌ కావడంతో ఈ మూవీని థియేటర్లోనే విడుదల చేయాలని మేకర్స్‌ నిర్ణయించుకున్నారు. దీంతో ‘తలైవి’ మూవీ ఏప్పుడు వస్తుందా అని  ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు పుల్‌స్టాప్‌ పెడుతూ తాజాగా మేకర్స్‌ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

చదవండి: షాకింగ్‌: నటి ప్రియాంక పండిట్‌ న్యూడ్‌ వీడియో లీక్‌, స్పందించిన నటి

సెప్టెంబర్‌ 10న తలైవి థియేటర్లో రానున్నట్లు చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాని నిర్మిస్తున్న విబ్రి మీడియా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించించింది. ‘ఐకానిక్‌ వ్యక్తి కథని పెద్ద తెరపైనే చూడాలి. తలైవి కోసం, ఆమె సినిమా ప్రపంచంలోకి సూపర్‌స్టార్‌ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందున, ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 10న విడుదల చేయబోతున్నాం’ అంటూ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌. కాగా తమిళనాడు దివంగత ముఖమంత్రి, అలనాటి నటి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ మూవీ రూపొందింది. ఇందులో బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ జయలలితగా కనిపించనుండగా, ఎంజీఆర్‌గా అరవింద స్వామి నటిస్తున్నాడు. ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎంజీఆర్‌ భార్యగా మధుబాల నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ మూవీని ఒకేసారి తెరకెక్కించారు.   

చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్‌ అనుమానాస్పద మృతి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement