తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా మలయాళం డైలాగ్స్ చెప్పనున్నారు. ఎందుకంటే ఈషాను మాలీవుడ్ పిలిచింది. అరవింద్ స్వామి, కుంచకో బోబన్స్ ప్రధాన పాత్రల్లో ఫెల్లిని దర్శకత్వంలో మలయాళం, తమిళ భాషల్లో ‘ఒట్టు’అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా ఈషా మలయాళ పరిశ్రమకు పరిచయం కానున్నారు. ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘‘నేను నటించిన ఓ సినిమా చూసి డైరెక్టర్ ఫెల్లిని ఇంప్రెస్ అయ్యారు. ‘ఒట్టు’లోని ఓ లీడ్ క్యారెక్టర్ నాకు సూట్ అవుతుందని ఆయన నన్ను సంప్రదించారు.
కథ నచ్చడంతో ఓకే చెప్పాను. మార్చి 27 నుంచి ఈ సినిమా షూటింగ్ గోవాలో ఆరంభం కానుంది. ఒకసారి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత లొకేషన్స్‌లో రోజువారీగా మలయాళ భాషపై పట్టు సాధిస్తాననే నమ్మకం ఉంది. నా ఫేవరెట్ యాక్టర్లు అరవింద్ స్వామి, కుంచకోలతో స్క్రీన్స్ షేర్ చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు ఈషా. ఈ సంగతి ఇలా ఉంచితే... అరవింద్ స్వామి నటిస్తున్న మూడో మలయాళ చిత్రం ‘ఒట్టు’. ఇంతకుముందు ‘డాడీ’ (1992), ‘దేవరాగమ్’ (1996) చిత్రాల్లో ఆయన నటించారు. అంటే.. అరవింద్ స్వామి మళ్లీ దాదాపు పాతికేళ్ల తర్వాత మలయాళ సినిమా చేస్తున్నారన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment