Ottu
-
బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే మోదీతో కేసీఆర్‌కు లోపాయికారీ ఒప్పందం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని జాగో తెలంగాణ సంస్థ ప్రతినిధి, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోదీతో లోపాయికారీ ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. జాగో తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రకుమార్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ కుటుంబం రూ.60 వేల కోట్ల వరకు దోపిడీ చేసినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేందుకే జాగో తెలంగాణ పేరుతో ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించి చైతన్యం చేస్తున్నామని చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థను ధ్వంసం చేసి గల్లీకొక బెల్టు షాపు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో విధ్వంసకర పాలన సాగుతోందని, ఇసుక, మట్టి, ల్యాండ్, లిక్కర్ మాఫియాలు చెలరేగుతున్నాయని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భయంకరమైన అవినీతి కనిపిస్తోందని ధ్వజమెత్తారు. పాలమూరు అధ్యయన వేదిక కన్వి నర్ రాఘవాచారి మాట్లాడుతూ పాలమూరు జిల్లా తెలంగాణ ఉద్యమకాలంలో ఎలా ఉందో ప్రస్తుతం అలాగే ఉందని, వలసలు ఏమాత్రం ఆగలేదన్నారు. పాలమూరు రాజకీయ నేతల బానిసత్వం కూడా పోలేదన్నారు. సమావేశంలో జాగో తెలంగాణ సంస్థ ప్రతినిధులు ఖలీదా ఫరీ్వన్, ప్రొఫెసర్ వినాయకరెడ్డి, ప్రొఫెసర్ పద్మజాషా, జావిద్ ఖాద్రి పాల్గొన్నారు. -
‘ఒట్టు’తో మాలీవుడ్‌కు వెళ్తున్న తెలుగు హీరోయిన్
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా మలయాళం డైలాగ్స్ చెప్పనున్నారు. ఎందుకంటే ఈషాను మాలీవుడ్ పిలిచింది. అరవింద్ స్వామి, కుంచకో బోబన్స్ ప్రధాన పాత్రల్లో ఫెల్లిని దర్శకత్వంలో మలయాళం, తమిళ భాషల్లో ‘ఒట్టు’అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా ఈషా మలయాళ పరిశ్రమకు పరిచయం కానున్నారు. ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘‘నేను నటించిన ఓ సినిమా చూసి డైరెక్టర్ ఫెల్లిని ఇంప్రెస్ అయ్యారు. ‘ఒట్టు’లోని ఓ లీడ్ క్యారెక్టర్ నాకు సూట్ అవుతుందని ఆయన నన్ను సంప్రదించారు. కథ నచ్చడంతో ఓకే చెప్పాను. మార్చి 27 నుంచి ఈ సినిమా షూటింగ్ గోవాలో ఆరంభం కానుంది. ఒకసారి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత లొకేషన్స్‌లో రోజువారీగా మలయాళ భాషపై పట్టు సాధిస్తాననే నమ్మకం ఉంది. నా ఫేవరెట్ యాక్టర్లు అరవింద్ స్వామి, కుంచకోలతో స్క్రీన్స్ షేర్ చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు ఈషా. ఈ సంగతి ఇలా ఉంచితే... అరవింద్ స్వామి నటిస్తున్న మూడో మలయాళ చిత్రం ‘ఒట్టు’. ఇంతకుముందు ‘డాడీ’ (1992), ‘దేవరాగమ్’ (1996) చిత్రాల్లో ఆయన నటించారు. అంటే.. అరవింద్ స్వామి మళ్లీ దాదాపు పాతికేళ్ల తర్వాత మలయాళ సినిమా చేస్తున్నారన్న మాట. చదవండి: రాముడిగా కనిపించేందుకు బరువు తగ్గుతున్న ప్రభాస్! -
రామ్‌గోపాల్ వర్మతో ఒట్టు?
ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న కాంబినేషన్ మోహన్‌బాబు, రామ్‌గోపాల్‌వర్మ. వీరిద్దరూ కలిసి సినిమా చేయడం.. అటు ప్రేక్షకుల్లో, ఇటు పరిశ్రమలో పెద్ద చర్చకే దారితీసింది. పాత్రల ఎంపిక విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండే రామ్‌గోపాల్‌వర్మ... తన కథకు మోహన్‌బాబుని హీరోగా ఎంచుకోవడం ఇక్కడ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. బాలీవుడ్లో వర్మ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘సర్కార్’ సినిమాను పోలి ఈ సినిమా ఉంటుందని సమాచారం. అయితే... సర్కార్ మాఫియా నేపథ్యం కాగా, ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘ఒట్టు’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు వినికిడి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. రెండువేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా... మోహన్‌బాబుపై ఓ ఎమోషనల్ సాంగ్‌ని వర్మ చిత్రీకరిస్తున్నారు. సాయికార్తీక్ స్వరపరచిన ఈ గీతం మోహన్‌బాబు వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా ఉంటుందని సమాచారం. ఇందులో మంచు విష్ణు కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.