రామ్‌గోపాల్ వర్మతో ఒట్టు?
రామ్‌గోపాల్ వర్మతో ఒట్టు?
Published Mon, Jan 6 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న కాంబినేషన్ మోహన్‌బాబు, రామ్‌గోపాల్‌వర్మ. వీరిద్దరూ కలిసి సినిమా చేయడం.. అటు ప్రేక్షకుల్లో, ఇటు పరిశ్రమలో పెద్ద చర్చకే దారితీసింది. పాత్రల ఎంపిక విషయంలో చాలా పర్‌ఫెక్ట్‌గా ఉండే రామ్‌గోపాల్‌వర్మ... తన కథకు మోహన్‌బాబుని హీరోగా ఎంచుకోవడం ఇక్కడ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. బాలీవుడ్‌లో వర్మ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘సర్కార్’ సినిమాను పోలి ఈ సినిమా ఉంటుందని సమాచారం.
అయితే... సర్కార్ మాఫియా నేపథ్యం కాగా, ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘ఒట్టు’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు వినికిడి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. రెండువేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా... మోహన్‌బాబుపై ఓ ఎమోషనల్ సాంగ్‌ని వర్మ చిత్రీకరిస్తున్నారు. సాయికార్తీక్ స్వరపరచిన ఈ గీతం మోహన్‌బాబు వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా ఉంటుందని సమాచారం. ఇందులో మంచు విష్ణు కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
Advertisement