జ్యోతిక, అరవింద్ స్వామి
ఒక పోలీస్, ఇంజనీర్, రాజకీయ నాయకుడు, రౌడీ.. ఈ నలుగురి ప్రొఫెషన్స్ వేరు అయినా టార్గెట్ మాత్రం ఒక్కటే. అయితే ఈ టార్గెట్‌ను గెలిచి ఎవరు నవాబ్‌గా నిలుస్తారో తెలుసుకోవాలంటే మాత్రం ‘చెక్క చివంద వానమ్’ చూడాల్సిందే. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక, అతిదీ రావ్ హైదరీ, ప్రకాశ్‌రాజ్ ముఖ్య తారలుగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ఇది. తెలుగులో ‘నవాబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఓ న్యూక్లియర్ ప్రాజెక్ట్ చుట్టూ సినిమా కథాంశం సాగుతుందని సమాచారం. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్‌ల్లో ఒకరు పోలీస్‌గా, మరొకరు రాజకీయ నాయకుడిగా, ఇంకొకరు ఇంజనీర్‌గా నటిస్తున్నారని చెన్నై ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో అరవింద్ స్వామికి జోడీగా జ్యోతిక నటిస్తున్నారన్నది తాజా సమాచారం. ఆల్రెడీ రీసెంట్‌గా జరిగిన షూట్‌లో వీరిపై పెళ్లి సీన్ కూడా షూట్ చేశారట. సగానికి పైగా షూట్‌ను కంప్లీట్ చేసుకున్న ‘నవాబ్’ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment