aditirav Hydari
-
తెలుగు పలుకులు
అదితీరావు హైదరీ.. పేరుకు బాలీవుడ్ కథానాయిక అయినా తెలుగు మూలాలున్న అమ్మాయే. మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా తెలుగులో తొలిసారి ‘సమ్మోహనం’ చిత్రంలో నటిస్తున్నారు. తొలి సినిమాకే తెలుగు నేర్చుకుని తన పాత్రకు అదితీ డబ్బింగ్ చెబుతుండటం విశేషం. సుధీర్‌బాబు, అదితీరావు జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న ‘సమ్మోహనం’ జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ –‘‘ఇంద్రగంటి ఎప్పుడూ దాదాపుగా తెలుగమ్మాయిలనే హీరోయిన్లుగా ఎంపిక చేసుకుంటారు. అదితీరావు హైదరి తెలుగు మూలాలున్న అమ్మాయి. మా సినిమా కోసం తెలుగు నేర్చుకుని, సొంతంగా డబ్బింగ్ చెబుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘కొత్త ఎత్తుగడ, కొత్త పోకడ ఉన్న నవతరం కథ ‘సమ్మోహనం’. రొమాన్స్, హాస్యం సమ్మిళితమై ఉంటాయి. మంచి కథ, కథనానికి చక్కటి నిర్మాణ విలువలు తోడయ్యాయి. టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా మొత్తం అందమైన ఫీల్ క్యారీ చేశాం’’ అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్. -
అంతరిక్షంలో థ్రిల్
వరుస విజయాలతో మాంచి జోరు మీద ఉన్నారు హీరో వరుణ్‌తేజ్. తొలి చిత్రం ‘ఘాజీ’తోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా హైదరాబాద్‌లో గురువారం ప్రారంభమైంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్పై రాజీవ్‌రెడ్డి ఎదుగురు, రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్), సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ కథానాయికలు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సంకల్ప్ రెడ్డి తండ్రి సహదేవ్ వీర్రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు క్లాప్ ఇచ్చారు. చిత్ర సహనిర్మాత క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ ఫ్రేమ్ సంస్థలో రూపొందుతున్న ఆరవ చిత్రమిది. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. అంతరిక్షం నేపథ్యంలో కథ సాగుతుంది. వరుణ్ తేజ్ వ్యోమగామిగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం పలు స్టూడియోల్లో భారీ సెట్స్ వేశాం. విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నాయి’’ అన్నారు. సత్యదేవ్, రాజా, అవసరాల, రెహ్మాన్ (రఘు) నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారీ. -
నలుగురి గురి.. సింగిల్ టార్గెట్!
ఒక పోలీస్, ఇంజనీర్, రాజకీయ నాయకుడు, రౌడీ.. ఈ నలుగురి ప్రొఫెషన్స్ వేరు అయినా టార్గెట్ మాత్రం ఒక్కటే. అయితే ఈ టార్గెట్‌ను గెలిచి ఎవరు నవాబ్‌గా నిలుస్తారో తెలుసుకోవాలంటే మాత్రం ‘చెక్క చివంద వానమ్’ చూడాల్సిందే. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక, అతిదీ రావ్ హైదరీ, ప్రకాశ్‌రాజ్ ముఖ్య తారలుగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ఇది. తెలుగులో ‘నవాబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ న్యూక్లియర్ ప్రాజెక్ట్ చుట్టూ సినిమా కథాంశం సాగుతుందని సమాచారం. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్ల్లో ఒకరు పోలీస్‌గా, మరొకరు రాజకీయ నాయకుడిగా, ఇంకొకరు ఇంజనీర్‌గా నటిస్తున్నారని చెన్నై ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో అరవింద్ స్వామికి జోడీగా జ్యోతిక నటిస్తున్నారన్నది తాజా సమాచారం. ఆల్రెడీ రీసెంట్గా జరిగిన షూట్లో వీరిపై పెళ్లి సీన్ కూడా షూట్ చేశారట. సగానికి పైగా షూట్‌ను కంప్లీట్ చేసుకున్న ‘నవాబ్’ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
అప్పుడు రోజా... ఇప్పుడు డ్యూయెట్!
హృదయానికి హత్తుకునే ప్రేమకథలు మాత్రమే కాదు, యాక్షన్ చిత్రాలు తీయడంలోనూ దర్శకుడు మణిరత్నంది ప్రత్యేక శైలి. లవ్ అండ్ యాక్షన్ మేళవించి ఆయన తీసిన ‘రోజా’ విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందు కుంది. అటువంటి చిత్రాన్ని మణిరత్నం మళ్లీ తెరకెక్కిస్తున్నారు. కార్తీ, అదితీరావ్ హైదరీ జంటగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ప్రేమకథ ‘డ్యూయెట్’. దీన్ని తెలుగులో ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. మార్చిలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కెమేరా: రవి వర్మన్, సంగీతం: ఏఆర్ రెహమాన్, సమర్పణ: శిరీష్.