హీరో కార్తీతో రాశీ ఖన్నా స్టెప్పులు | Raashi Khanna And Karthi Joins Shooting For Sadar At Mysore | Sakshi
Sakshi News home page

హీరో కార్తీతో రాశీ ఖన్నా స్టెప్పులు

Published Sun, Apr 17 2022 7:56 AM | Last Updated on Sun, Apr 17 2022 8:02 AM

Raashi Khanna And Karthi Joins Shooting For Sadar At Mysore - Sakshi

‘సర్దార్‌’తో స్టెప్పులేస్తున్నారు హీరోయిన్‌ రాశీ ఖన్నా. పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సర్దార్‌’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రాశీ ఖన్నా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ మైసూర్‌లో జరుగుతోంది. కార్తీ, రాశీ ఖన్నాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించే ప్లాన్‌లో ఉంది యూనిట్‌.

ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా కార్తీ రెండు పాత్రలు చేస్తున్నారు. ఆఫీసర్‌ అయిన కొడుకు పాత్రకు జోడీగా రాశీ ఖన్నా కనిపిస్తారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్‌ కానుంది. ఇక రాశీ ఖన్నా తెలుగులో నటించిన ‘పక్కా కమర్షియల్‌’, ‘థ్యాంక్యూ’ చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement