సర్ధార్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?
తలపై బండరాయితో మోది మట్టుబెట్టిన దుండగులు
కోదాడ మండలం గణపవరంలో ఘటన
కోదాడరూరల్: ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగు లు బండరాయితో తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. కోదాడ మండలం గణపవరం గ్రామంలో మంగళవారం ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్.సర్ధార్ (52) లారీడ్రైవర్‌గా పని చేస్తు జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే డ్యూటీ ముగించుకుని సోమవారం ఇంటికి వచ్చాడు. అన్నం తిన ్న తర్వాత ఇంటి ఎదురుగా ఉన్న అరుగుపై పడుకునేందుకు వెళ్లాడు. అదే అరుగుపై పడుకోవాడానికి ఇంటి పక్కన ఉన్న మరో వ్యక్తి అక్కడకు వచ్చి చూడగా సర్ధార్ తలపై రాయిపడి ఉండటం గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.
ఈలోపు చుట్టుపక్కల ఇంటి వారు గుమిగూడి అతడిని పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. దాదాపుగా 50 కేజీల బరువున్న రాయిని తలపై ఎత్తివేయడంతో నుదుటి భాగం నుజ్జునుజ్జై తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. సమాచారం తెలుసుకుని కోదాడ రూరల్ సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి డ్వాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంను పిలిపించి విచారణ చేపట్టారు. జాగిలాలు గ్రామ వీధుల నుంచి మేళ్లచెర్వు మండలం రామాపురం వైపు ఉన్న కల్వకట్ట వరకు వెళ్లి నిలిచి పోయాయి. మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
వివాహేతర సంబంధమే కారణమా?
సర్ధార్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్ధార్ గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని పదిహేనేళ్లుగా అక్కడే ఉన్నాడు. నాలుగేళ్ల క్రితం కుమారుడి వివాహానికి వచ్చి భార్య వద్దనే ఉంటున్నాడు. తమను దూరం చేశాడనే ఉద్దేశంతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న సదరు మహిళ, ఆమె కుమారుడు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి కుమారుడు జానీపాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లారీడ్రైవ ర్‌గా పనిచేస్తున్న సర్ధార్ ఇంకా ఎరితోనైనాన గొడవలు పెట్టుకున్నాడా.. అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, వివాహాలైన ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.