కోదాడ: నల్లగొండ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. కోదాడ మండలం గణపవరానికి చెందిన సర్దార్ అనే వ్యక్తి సోమవారం రాత్రి ఇంటి ముందు నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు రాళ్లతో అతని తలపై మోది చంపారు. కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం చూసేసరికి సర్దార్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.