![Hero Karthi Shocking Look From Sardar Goes Viral In Social Media - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/14/KARTHI.gif.webp?itok=XtJez34u)
ఈ మధ్యకాలంలో సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతున్నారు మన హీరోలు. ఒక్కో సినిమాకి ప్రాణం పెట్టి పని చేస్తారు. క్యారెక్టర్ కోసం ఏం చేయడానికైనా రెడీ అంటున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కూడా ఇదే చేశాడు. తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కార్తి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు సర్దార్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాడు.
ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్న కార్తీ కంప్లీట్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయింది. తాజాగా ఈ సినిమాలోని కొన్ని స్టిల్స్‌ని మూవీ టీం రిలీజ్ చేసింది. ఇందులో పూర్తిగా గుర్తు పట్టకుండా ఉన్న కార్తీని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పూర్తి మేకోవర్‌తో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తీ సరసన రాశీఖన్నా నటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment