సర్దార్‌ 2 సెట్స్‌లో ప్రమాదం.. ఒకరి మృతి | Accident In Sardar Movie Sets | Sakshi
Sakshi News home page

సర్దార్‌ 2 సెట్స్‌లో ప్రమాదం.. ఒకరి మృతి

Published Wed, Jul 17 2024 12:32 PM | Last Updated on Wed, Jul 17 2024 1:19 PM

 Accident In Sardar Movie Sets

కార్తీ హీరోగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్దార్‌ 2’ చిత్ర షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక భారీ ఫైట్‌ సీన్‌ షూట్‌ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పీఎస్‌ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్‌ -2 ప్రకటన వచ్చిన కొద్దిరోజుల్లోనే షూటింగ్‌ను ప్రారంభించారు.

మిషన్‌ కంబోడియా నేపథ్యంలో సాగే సర్దార్‌ 2 పూజా కార్యక్రమం ఇటీవలే చెన్నైలో జరిగింది. జులై 15 నుంచి సర్దార్‌ 2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఒక ఫైట్‌ సీన్‌ను తెరకెక్కిస్తున్న క్రమంలో సెట్స్‌లో ప్రమాదం జరిగింది. ఎజుమలై అనే ఫైట్‌ మాస్టర్‌  సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి  కిందపడి మరణించారు. ఎక్కువ ఎత్తు నుంచి కిందపడటంతో ఆయన ఛాతీ భాగంలో తీవ్ర గాయం అయింది. దీంతో  ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడం వల్లే  అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అయితే, ప్రమాదం జరిగన సమయంలో హీరో కార్తీ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కంగువ, భారతీయుడు, దేవర వంటి సినిమా చిత్రీకరణ సమయంలో కూడా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అలాంటి సమయంలో ఎక్కువగా ఫైట్‌ మాస్టర్స్‌ గాయపడటం వల్ల చిత్రపరిశ్రమను ఆందోళనకు గురిచేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement