సంక్రాంతి బరిలో కూడా 'సర్ధార్' లేనట్టేనా? | sardar not releasing for sankranthi | Sakshi
Sakshi News home page

సంక్రాంతి బరిలో కూడా 'సర్ధార్' లేనట్టేనా?

Published Sun, Aug 30 2015 9:42 AM | Last Updated on Sat, Jul 6 2019 4:09 PM

సంక్రాంతి బరిలో కూడా 'సర్ధార్' లేనట్టేనా? - Sakshi

సంక్రాంతి బరిలో కూడా 'సర్ధార్' లేనట్టేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ లో భారీ మాస్ పాలోయింగ్ ఉన్న స్టార్ హీరో.. వరుస సూపర్ హిట్స్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ సెట్ చేసిన పవర్ స్టార్ చాలా రోజులుగా షూటింగ్ లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అత్తారింటింకి దారేది లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత గోపాల గోపాల మూవీలో స్పెషల్ క్యారెక్టర్ చేసిన పవన్ ఆ తరువాత చాలా కాలం పాటు ముఖానికి రంగు వేసుకోలేదు.

మధ్యలో పొలిటికల్ టర్న్ తీసుకున్న పవన్ చాలా రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. గబ్బర్ సింగ్ సక్సెస్ తరువాత ఆ సినిమాకు సీక్వల్ ఉంటుందని ఎనౌన్స్ చేసిన పవన్... సంపత్ నందితో కలిసి కథ కథనాలను కూడా రెడీ చేశాడు. అయితే మధ్యలో ఏ సమస్య వచ్చిందో ఏమోగాని సంపత్ ను సీన్ నుంచి తప్పించి పవర్ ఫేం బాబీతో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.

అయితే అంతా రెడీగా ఉన్న పవన్ మాత్రం ఈ సినిమాను ఎప్పటికి పూర్తి చేస్తాడో అర్థం కావటం లేదు. నటీనటుల ఎంపిక కోసం నెలల తరబడి వెయిట్ చేయించిన పవర్ స్టార్ ఇంకా చాలా మంది ఎంపిక విషయంలో ఆలోచనలోనే ఉన్నాడు. దీనికి తోడు రెండు షెడ్యూల్లు పూర్తయినట్టుగా చెపుతున్నా అందులో పవన్ నటించిన సీన్స్ మాత్రం ఒకటి రెండుకు మించి లేవన్న టాక్ వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలోకి సర్ధార్ ను తీసుకురావటం కష్టంగానే కనిపిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement