
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్దార్’ (2022) సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ హిట్ కాంబినేషన్‌లోనే ‘సర్దార్ 2’ రూపొందుతోంది. ఈ మూవీలో కార్తీకి జోడీగా మాళవికా మోహనన్ నటిస్తున్నట్లు శుక్రవారం మేకర్స్ ప్రకటించారు. ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
‘‘సర్దార్’ తమిళ, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందిస్తున్న ‘సర్దార్ 2’ షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య ఓ పవర్‌ఫుల్‌పాత్ర చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment