కెమెరామెన్‌తో పెళ్లి పీటలు ఎక్కనున్న రవితేజ హీరోయిన్‌ | Actress Rajisha Vijayan To Marry Cinematographer | Sakshi
Sakshi News home page

కెమెరామెన్‌తో పెళ్లి పీటలు ఎక్కనున్న రవితేజ హీరోయిన్‌

Published Sat, Jun 1 2024 7:36 AM | Last Updated on Sat, Jun 1 2024 11:53 AM

Actress Rajisha Vijayan To Marry Cinematographer

చిత్రపరిశ్రమలో హీరోయిన్ల పెళ్లి అంటేనే పెద్ద వార్తగా మారుతున్న పరిస్థితి. కొంత కాలం పాటు డేటింగ్‌ చేసి కొందరు పెళ్లి పీటలెక్కుతే.. మరికొందరు మాత్రం పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే  ఓ యంగ్ హీరోయిన్ తన ప్రియుడ్ని పరోక్షంగా పరిచయం చేసింది. త్వరలో పెళ్లితో శుభం కార్డు వేయాలని ఆ బ్యూటీ చూస్తుందట. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా..?

రజీషా విజయన్‌ గుర్తుందా.  మొదట్లో  పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొని పాపులర్‌ అయిన ఈ కేరళ భామ..‌ 2016లో మలయాళంలో కథానాయకిగా రంగప్రవేశం చేశారు. మాతృభాషలో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా పొందింది.  2021లో తమిళంలో కర్ణన్‌ చిత్రంలో ధనుష్‌కు జంటగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత జైభీమ్, సర్దార్‌ వంటి చిత్రాల్లో మెప్పించింది. సర్దార్‌ చిత్రం తరువాత కోలీవుడ్‌ లో కనిపించని రజీషా తెలుగులో రవితేజ నటించిన రామారావు ఆన్‌ డ్యూటీ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. 

ఇలా బహుభాషా నటిగా గుర్తింపు పొందిన ఈమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తాజా సమాచారం. మలయాళ ప్రముఖ చాయాగ్రహకుడు టోపిన్‌ థామస్‌తో కలిసి ఏడడుగులు వేయనున్నట్లు తెలిసింది. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'ఖోఖో', 'లవ్లీ యువర్స్' సినిమాలకు పనిచేశారు. అలా మొదలైన పరిచయం ఇప్పుడు ప్రేమ వరకు వెళ్లిందనమాట. అయితే దీనికి సబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement