కార్తీక్, దివ్యాంశా, సిద్ధార్థ్, సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
‘‘తెలుగు కవిత్వం చదివి, చూసి అది నా లోపలకి వెళ్లిపోయింది. సో.. నేను చెప్పినా... చెప్పకపోయినా.. తెలుగు బిడ్డనే’’ అని సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్ హీరోగా కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టక్కర్’. ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ హీరోయిన్‌గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘టక్కర్’ ఒక యాక్షన్ ఫిల్మ్. న్యూ ఏజ్ లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. కొంతకాలం తర్వాత నేను చేసిన కమర్షియల్ సినిమా ఇది’’ అన్నారు.
‘‘మా గురువుగారు శంకర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ, మీ హీరో సిద్ధార్థ్, దివ్యాంశ... ఈ మూడు కారణాల వల్లే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుంది’’ అన్నారు కార్తీక్ జి. క్రిష్. ‘‘టక్కర్’ విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్. ‘‘విశ్వప్రసాద్, వివేక్‌గార్లు నాకు మంచి మిత్రులు. ‘టక్కర్’ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత డి. సురేష్‌బాబు. ఈ వేడుకలో దర్శకులు ‘బొమ్మరిల్లు’ భాస్కర్, తరుణ్ భాస్కర్, వెంకటేశ్ మహా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment