takkar
-
ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 24 సినిమాలు
ఏదైనా సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీకెండ్ మీరు పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటి రెండు కాదు ఏకంగా 24 కొత్త మూవీస్ విడుదలకు సిద్ధమైపోయాయి. ఈ సోమవారం చూసినప్పుడు 24 సినిమాల లిస్ట్ వచ్చింది. వాటిలో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. ఇక ఈ శుక్రవారం కోసం మరికొన్ని కొత్తవి యాడ్ అయ్యాయి. దీంతో ఒక్కరోజే దాదాపు 24 చిత్రాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ లోకి రానున్నాయని క్లారిటీ వచ్చేసింది. వీటిలో తెలుగు సినిమాలు చాలానే ఉండటం విశేషం. (ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?) ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ అమెజాన్ ప్రైమ్ అదురా - తెలుగు డబ్బింగ్ సిరీస్ ద హారర్ ఆఫ్ డోలెరస్ రోచ్ - ఇంగ్లీష్ సిరీస్ చక్రవ్యూహం - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) స్వీట్ కారం కాఫీ - తెలుగు డబ్బింగ్ సిరీస్ (స్ట్రీమింగ్) ఫిట్ చెక్: కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ యూకే క్వీన్ - ఫిలిప్పీన్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) నెట్‌ఫ్లిక్స్ ఫేటల్ సెడక్సన్ - ఇంగ్లీష్ సిరీస్ టక్కర్ - తెలుగు సినిమా ద ఔట్ లాస్ - ఇంగ్లీష్ మూవీ ద పోప్స్ ఎగ్జార్సిస్ట్ - ఇంగ్లీష్ చిత్రం హ్యాక్ మై హోమ్ - ఇంగ్లీష్ సిరీస్ గోల్డ్ బ్రిక్ - ఫ్రెంచ్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్) డీప్ ఫేక్ లవ్ - పోర్చుగీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) వేక్ అప్ కార్లో - పోర్చుగీస్ సిరీస్ (స్ట్రీమింగ్) ఆహా 3:33 - తమిళ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ IB 71 - హిందీ సినిమా రుద్రమాంబపురం - తెలుగు మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) జీ5 అర్చిర్ గ్యాలరీ - బెంగాలీ సినిమా కతర్భాషా ఎండ్ర ముత్తురామలింగం - తమిళ చిత్రం తర్లా- హిందీ మూవీ సోనీ లివ్ ఫర్హానా - తెలుగు డబ్బింగ్ మూవీ జియో సినిమా బ్లయిండ్ - హిందీ చిత్రం HR ఓటీటీ అనురాగం - మలయాళ మూవీ ముబీ రిటర్న్ టూ సియోల్ - ఇంగ్లీష్ సినిమా (ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి ..సలార్ క్యాప్షన్‌కు అర్థం తెలుసా?) -
ఓటీటీకి వచ్చేస్తోన్న 'టక్కర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్, దివ్యాన్షా జంటగా నటించిన తాజా చిత్రం 'టక్కర్'. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కార్తీక్ క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. నెలరోజులు కాకముందే ఓటీటీకి వచ్చేస్తోంది. (ఇది చదవండి: టక్కర్ మూవీ ట్విటర్ రివ్యూ, సిద్దార్థ్ హిట్ కొట్టాడా?) ఈనెల 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. లవ్ అండ్ యాక్షన్ నేపథ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాలో యోగిబాబు, అభిమన్యు సింగ్, మునిశ్కాంత్, ఆర్జే విఘ్నేష్ కాంత్, అరుణ్ వైద్యనాథన్, విశ్వ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ నటుడు.. ఫోటో వైరల్!) -
టక్కర్ మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
టక్కర్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ గ్లామర్ షో (ఫోటోలు)
-
టక్కర్ మూవీ ట్విటర్ రివ్యూ, సిద్దార్థ్ హిట్ కొట్టాడా?
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగులో విశేష గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సిద్దార్థ్. కానీ ఆ స్టార్‌డమ్‌ను అలాగే కాపాడుకోలేకయాడు. వరుస అపజయాలతో తెలుగు చిత్రసీమకు దూరమయ్యాడు. ఒరేయ్ బామ్మర్ది, మహాసముద్రం చిత్రాలతో మళ్లీ తెలుగు ఆడియన్స్‌ను పలకరించినప్పటికీ విజయం మాత్రం అందని ద్రాక్షే అయింది. తెలుగులో ఎలాగైనా తిరిగి పట్టు సాధించాలన్న కసితో టక్కర్‌తో ముందుకు వచ్చాడు సిద్దార్థ్. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. శుక్రవారం (జూన్ 9న) తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో థియేటర్లో టక్కర్ చూసిన సినీ ప్రియులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి టక్కర్ సినిమా ఎలా ఉంది? సిద్దార్థ్ ఈసారైనా హిట్టు కొట్టాడా? అనే అంశాలను నెటిజన్ల మాటల్లో తెలుసుకుందాం. సిద్దార్థ్ తన పాత్రకు న్యాయం చేశాడు. యోగి బాబు కామెడీ బాగుంది. ఆర్జే విఘ్నేశ్‌కాంత్ పాత్ర పర్వాలేదు అని చెప్పుకొస్తున్నారు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ యావరేజ్ కంటే కూడా దారుణంగా ఉందంటున్నారు. సినిమా యావరేజ్ అని చెప్తున్నారు. Premier show🎬 ~ #Takkar @sathyamcinemas ... Sidharth done his role really gud, Yogi Babu comedy works gud & rj Vigneshkanth portion is okay ... But stry wise aracha maava aracha maari iruku 😮💨 1 word review - takkar knjm makkar 🥱 — 𝑁𝐾 (@_naviin_13) June 9, 2023 #Takkar first half So far so good except yogibabu comedy😀😀 — Poovanesh S (@poova4u) June 9, 2023 #TakkarReview Decent first half with below avg second half. Fight sequences good. Old template. Script could have been better in Second half. Cringe comedy. Siddharth🔥, Divyansha😍, yogibabu waste Decent BGM, Good visuals. Run time big plus. Overall - Average pic.twitter.com/WZhBHudCEi — Poovanesh S (@poova4u) June 9, 2023 Racy second half, @iYogiBabu's nonstop comedy,worked well, Feel good commercial movie after a longtime. #Takkar #TakkarFromJune9 #TakkarFromTomorrow — Karthick T (@karthickt) June 8, 2023 #TAKKAR - Didn't work for me. Dull 1st half, below par 2nd half. Mass moments & Love portions didn't work at all. Songs good. Yogi Babu scenes worked at some places. Climax 🤐🤧😷 Disappointed 💔🚶🏻 https://t.co/JjfJMuNWxu pic.twitter.com/vM7t608A0d — Kumarey (@Thirpoo) June 8, 2023 #Takkar Movie Review : ⭐⭐½ Strictly Average 1st half and decent 2nd Half Comedy Worked in bits and decent songs👍 But Action & Emotions didn't work well 👎 Overall another Below Par Movie from #Siddharth Hope he gives comeback soon🤞 — Thyview (@Thyveiw) June 8, 2023 చదవండి: కోలీవుడ్ నుంచి ఆఫర్, నో చెప్పిన హీరోయిన్ శ్రీలీల -
నా టైమ్ స్టార్ట్ అయినట్లు అనిపిస్తోంది
‘‘నేనో సినిమా తీయాలనుకుంటే ఆ సినిమాను తీసేంత స్వేచ్ఛ నాకు కావాలి. ఇదే నా డ్రీమ్. తమిళంలో నేను చేయగలుగుతున్నాను. కానీ తెలుగులో నాకు అంతగా సపోర్ట్ లభించలేదు. అయినా తెలుగు ఆడియన్స్‌కు, నాకు ఫుల్స్టాప్ కాదు కదా.. చిన్న కామా కూడా పడలేదు.. తెలుగు ప్రేక్షకులకు నాకు మధ్యలో ఉన్నది చిన్న టైమ్ గ్యాప్ మాత్రమే. ఇప్పుడు ‘టక్కర్’తో టైమ్ కలిసొచ్చినట్లుగా నాకు అనిపిస్తోంది’’ అని సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా విలేకరుల సమావేశంలో సిద్ధార్థ్ చెప్పిన విశేషాలు. ► ధనవంతుణ్ణి కావాలనే లక్ష్యంతో సిటీకి వస్తాడు ఓ కుర్రాడు. అయితే అన్నీ అతని ఊహలకు వ్యతిరేకంగా జరుగుతుంటే ఏం చేస్తాడు? ఎవరితో అతను ఘర్షణ పడాల్సి వస్తుంది? అన్నదే ‘టక్కర్’ కథాంశం. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. హీరో, హీరోయిన్ రిలేషన్‌షిప్‌లోనూ చాలా షేడ్స్ ఉంటాయి. డబ్బు, అహం, లింగబేధం, వయసు.. ఇలాంటి అంశాలు కథలో చర్చకు వస్తాయి. కార్తీక్ క్రిష్ ఈ సినిమాను బాగా డైరెక్ట్ చేశారు. ► లవ్‌స్టోరీస్ సినిమాల గురించి చర్చకు వస్తే.. వాటిలో ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ సినిమాలు కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా నాకు లవ్‌స్టోరీ చెబితే, దాదాపు నో చెబుతాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక లవ్‌స్టోరీ సినిమా చేసి, అది హిట్ అయితే నాకు మళ్లీ ఓ పదేళ్ల పాటు లవ్‌స్టోరీలే వస్తాయి. నేను లవ్‌స్టోరీస్ మాత్రమే చేయడానికి ఇండస్ట్రీకి రాలేదు. యాక్టర్‌గా డిఫరెంట్ సినిమాలు చేయాలి. ► రచయితగా ‘గృహం’ ఫ్రాంచైజీకి కథలు రెడీ చేస్తున్నాను. మా ప్రొడక్షన్ హౌస్‌లో కొత్తవారితో సినిమాలు నిర్మిస్తున్నాం. భవిష్యత్‌లో దర్శకత్వం చేస్తాను. ‘బొమ్మరిల్లు 2’ ఆలోచన ఉంది. కానీ అది పెద్ద చాలెంజ్‌తో కూడుకున్న పని.. చూడాలి. ► యాక్టర్‌గా నేను మంచి ఫామ్‌లోకి వచ్చిన ఫీలింగ్ ఇప్పుడు కలుగుతోంది. మళ్లీ తెలుగులో నా టైమ్ స్టార్ట్ అయినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం ‘ఇండియన్ 2’లో కీలక పాత్ర, ‘ది టెస్ట్’లో ఓ లీడ్ రోల్, ‘చిన్నా’ సినిమా చేస్తున్నాను. ఓ స్ట్రయిట్ లవ్‌స్టోరీ ఫిల్మ్ షూటింగ్ పూర్తి కావొచ్చింది. కార్తీక్ క్రిష్‌తో మరో సినిమా చేయనున్నాను. ► మీకు ఇంకా మ్యారేజ్ చేసుకునే ఏజ్ రాలేదంటారా? అని ఓ విలేకరి అడగ్గా... ‘మ్యారేజ్ చేసుకునే ఏజ్ నాకు వచ్చినప్పుడు.. ఆ పెళ్లి భోజనం తింటున్నప్పుడు మీకు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ పెళ్లి భోజనం నాకు గొంతు దిగడం లేదు. సో.. దానికి ఓ టైమ్ ఉంది. డైరెక్షన్ నా డ్రీమ్. నా మ్యారేజ్ నా పేరెంట్స్ డ్రీమ్. నా పెళ్లి, రిలేషన్షిప్స్ గురించి వార్తలు వచ్చాయంటే అవి రాసిన వారిని అడగాలి’’ అని అన్నారు సిద్ధార్థ్. -
ఈ మూడు కారణాల వల్లే తెలుగులో రిలీజ్ అవుతున్న టక్కర్
‘‘తెలుగు కవిత్వం చదివి, చూసి అది నా లోపలకి వెళ్లిపోయింది. సో.. నేను చెప్పినా... చెప్పకపోయినా.. తెలుగు బిడ్డనే’’ అని సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్ హీరోగా కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టక్కర్’. ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ హీరోయిన్గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘టక్కర్’ ఒక యాక్షన్ ఫిల్మ్. న్యూ ఏజ్ లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. కొంతకాలం తర్వాత నేను చేసిన కమర్షియల్ సినిమా ఇది’’ అన్నారు. ‘‘మా గురువుగారు శంకర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ, మీ హీరో సిద్ధార్థ్, దివ్యాంశ... ఈ మూడు కారణాల వల్లే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుంది’’ అన్నారు కార్తీక్ జి. క్రిష్. ‘‘టక్కర్’ విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్. ‘‘విశ్వప్రసాద్, వివేక్గార్లు నాకు మంచి మిత్రులు. ‘టక్కర్’ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత డి. సురేష్‌బాబు. ఈ వేడుకలో దర్శకులు ‘బొమ్మరిల్లు’ భాస్కర్, తరుణ్ భాస్కర్, వెంకటేశ్ మహా తదితరులు పాల్గొన్నారు. -
ఒక వర్ణం చేరెలే...
‘రెయిన్ బో చివరే.. ఒక వర్ణం చేరెలే...’ అంటూ కారులో వెళుతూ, దారిలో కలిసినవారితో సరదాగా గడుపుతూ పాడుకుంటున్నారు సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘టక్కర్’ చిత్రంలో పాట ఇది. సినిమాలో వచ్చే ఈ నాలుగో పాట వీడియోను శుక్రవారం రిలీజ్ చేశారు. చిత్ర సంగీతదర్శకుడు నివాస్ కె. ప్రసన్న స్వరపరచిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. బెన్నీ దయాల్, వృషబాబు పాడారు. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘‘ఈ చిత్రంలో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తారు. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్. -
ఇండియన్ 2 చరిత్ర సృష్టిస్తుంది అందులో నా క్యారెక్టర్..!
-
అదితిరావు హైదరితో డేటింగ్ గురించి సిద్ధార్థ్ మాటల్లో వినండి..!
-
8 సినిమాలు లైన్లో ఉన్నాయి ఏహీరో తో డైరెక్షన్ చేస్తానుఅంటే..!
-
ప్రభాస్ కి నాకు ఉన్న లింక్ ఏంటిటంటే..!
-
ఈ సినిమాలో రియల్ కార్లతో స్టంట్స్ చేసినపుడు ..!
-
నా ఏజ్ కనిపించక పోవడానికి సీక్రెట్ ఏంటంటే..!
-
ఇండియన్ 2 లో నా క్యారెక్టర్..? ప్రభాస్, నేను పుట్టుమచ్చల గ్యాంగ్!
-
అలాంటి వారికి సమాధానమే టక్కర్
‘‘మీరెప్పుడూ లవర్ బోయ్ పాత్రలు చేస్తుంటారు. కంప్లీట్ కమర్షియల్ సినిమా చేయొచ్చు కదా?’ అని చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటారు.. వారికి సమాధానమే ‘టక్కర్’. ఫుల్ యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్‌తో ఈ ప్రేమకథ నడుస్తుంది’’ అన్నారు సిద్ధార్థ్. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్ జంటగా నటించిన చిత్రం ‘టక్కర్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘బాయ్స్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చా. ఈ ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరీర్ పూర్తవుతుంది. ఇప్పటికీ నా చేతిలో అరడజను సినిమాలు ఉండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘టక్కర్’ న్యూ జనరేషన్ సినిమా. ఇందులో సిద్ధార్థ్‌ని రగ్డ్ లవర్ బోయ్‌గా చూస్తారు ’’ అన్నారు కార్తీక్ జి. క్రిష్. ‘‘ఈ సినిమాతో మళ్లీ పాత సిద్ధార్థ్‌ని చూస్తాం’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. -
TAKKAR : హీరో సిద్ధార్థ్ 'టక్కర్' సినిమా స్టిల్స్ (ఫొటోలు)
-
కయ్యాలే...కయ్యాలే
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ‘కయ్యాలే...కయ్యాలే’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నివాస్ కె. ప్రసన్న సంగీత సారథ్యంలో కృష్ణకాంత్ లిరిక్స్ అందించిన ఈ పాటను నిరంజన్ రామనన్ ఆలపించారు. ఈ సినిమాకు సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్. -
'లవ్ అంటేనే ఇష్టం లేదంటోన్న హీరోయిన్'.. ఆసక్తిగా టీజర్
‘నేనంటే ఇష్టం లేదా’ అని అబ్బాయి అంటే... ‘లవ్ అంటేనే ఇష్టం లేదు’ అని అంటుంది అమ్మాయి. ఈ ఇద్దరి కథ ఏంటనేది ‘టక్కర్’లో తెలుస్తుంది. సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘టక్కర్’. సోమవారం సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ పైన పేర్కొన్న సంభాషణలతో సాగుతుంది. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మే 26న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: నివాస్ కె. ప్రసన్న, కెమెరా: వాంచినాథన్ మురుగేశన్. -
రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌గా అజేయ కల్లం
-
రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌గా అజేయ కల్లం
⇒ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ⇒ నేడు బాధ్యతలు స్వీకరణ సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆర్థిక, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న సత్య ప్రకాశ్ టక్కర్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం అజేయ కల్లాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఆయన మార్చి నెలాఖరునే పదవీ విరమణ చేయనున్నారు. అజేయ కల్లం రాష్ట్రంలో పలు కీలక శాఖల్లో పనిచేశారు. సమర్థ్ధవంతమైన అధికారిగా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తారని పేరుంది. అయితే తొలుత అజేయ కల్లంకు సీఎస్‌గా నియమించిన తర్వాత 3 నెలలు చొప్పున రెండు సార్లు పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తుందని అందరూ భావించారు. కానీ ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన ప్రభుత్వం అదే జీవోలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి సీఎస్‌గా దినేశ్ కుమార్‌ను నియమిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న దినేశ్ కుమార్ 1983వ బ్యాచ్‌కు చెందిన వారు. -
సీఎస్‌పై ఉత్కంఠకు తెర
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వ కొత్త కార్యదర్శిగా అజేయ కల్లంను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 1983 బ్యాచ్ కు చెందిన అజయ్ కల్లం ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మార్చి 31వ తేదీతో అజేయ కల్లం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో మరొకరిని నియమించే అవకాశాలున్నాయంటూ వార్తలు రావటంతో కొంత ఆసక్తి ఏర్పడింది. అయితే, అజేయ కల్లంనే సీఎస్‌గా నియమించేందుకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, అజేయ కల్లం పదవీ కాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుత సీఎస్ టక్కర్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. -
తిరుపతి ఖ్యాతి ఇనుమడించేలా సైన్స్ కాంగ్రెస్
► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.ఎస్. టక్కర్ యూనివర్సిటీక్యాంపస్: తిరుపతిలో జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు ఏర్పాట్లు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్. టక్కర్ పిలుపునిచ్చారు. సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం ఎస్వీయూ సెనేట్హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీయూకు వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జనవరిలో జరిగే 104వ సైన్స్ కాంగ్రెస్ ఎస్వీయూలో జరగడం విశేషమన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, సీఎం చంద్రబాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్న నేపధ్యంలో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వివిధ సైన్స్ సంస్థల నుంచి సుమారు 12వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సైన్స్ కాంగ్రెస్‌లో మహిళా సైన్స్ కాంగ్రెస్ , చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో సాంకేతిక ప్రజ్ఞావంతులు, మేథావులు హాజరు అవుతున్నారని తెలిపారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఈ కార్యక్రమం నిర్వహణకు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ప్రభుత్వం, అధికారులు ఏఏ కార్యక్రమాలు చేయాలనేదానిపై స్పష్టత ఉండాలన్నారు. విశాఖపట్నం దేశంలోని అత్యంత పరిశుభ్ర నగరంగా అభివద్ధి చెందిందని అక్కడ బ్రిక్స్ సమ్మిట్, ప్లీట్ రివ్యూలు విజయవంతంగా నిర్వహించామన్నారు. అదేస్థాయిలో తిరుపతిలో కూడా సైన్స్ కాంగ్రెస్‌ను విజయవంతం చేసి ఎస్వీ ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి తీసుకుని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్, ఎస్పీ జయలక్ష్మీ, ఎస్వీయూ వీసీ దామోదరం పాల్గొన్నారు. -
తిరుమలలో చీఫ్ సెక్రటరీ టక్కర్
తిరుమల (అలిపిరి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ మంగళవారం తిరుమలకు వచ్చారు. ఇక్కడి పద్మావతి అతిథి గహాల వద్దకు చేరుకున్న ఆయకు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. -
చిన్న, మధ్య తరహ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు
నెల్లూరు(పొగతోట): చిన్న, మధ్యతరహ పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి టక్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రాథమిక రంగాలు రెండంకెల వృద్ధి రేటు సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. డబుల్ డిజిట్ 15 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణాలకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు. ఏపీఐఐసీకి భూములు కేటాయించి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇండస్ట్రియల్ పార్కులు, ఎస్ఈజెడ్లకు భూములు కేటాయించాలన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. తొలుత కలెక్టర్ ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ వీడియో కాన్ఫరెన్స్‌కు సంబం«ధించి ఆయా శాఖల అధికారులతో వారి చాంబర్లల్లో సమావేశాలు నిర్వహించారు.