'లవ్‌ అంటేనే ఇష్టం లేదంటోన్న హీరోయిన్'.. ఆసక్తిగా టీజర్ | Takkar Teaser Release | Sakshi
Sakshi News home page

'లవ్‌ అంటేనే ఇష్టం లేదంటోన్న హీరోయిన్'.. ఆసక్తిగా టీజర్

Published Tue, Apr 18 2023 12:44 AM | Last Updated on Tue, Apr 18 2023 8:05 AM

Takkar Teaser Release - Sakshi

సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్‌

‘నేనంటే ఇష్టం లేదా’ అని అబ్బాయి అంటే... ‘లవ్‌ అంటేనే ఇష్టం లేదు’ అని అంటుంది అమ్మాయి. ఈ ఇద్దరి కథ ఏంటనేది ‘టక్కర్‌’లో తెలుస్తుంది. సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ‘టక్కర్‌’. సోమవారం సిద్ధార్థ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ పైన పేర్కొన్న సంభాషణలతో సాగుతుంది.

కార్తీక్‌ జి. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, పాషన్‌ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మే 26న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: నివాస్‌ కె. ప్రసన్న, కెమెరా: వాంచినాథన్‌ మురుగేశన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement