‘రెయిన్ బో చివరే.. ఒక వర్ణం చేరెలే...’ అంటూ కారులో వెళుతూ, దారిలో కలిసినవారితో సరదాగా గడుపుతూ పాడుకుంటున్నారు సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘టక్కర్’ చిత్రంలో పాట ఇది. సినిమాలో వచ్చే ఈ నాలుగో పాట వీడియోను శుక్రవారం రిలీజ్ చేశారు. చిత్ర సంగీతదర్శకుడు నివాస్ కె. ప్రసన్న స్వరపరచిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. బెన్నీ దయాల్, వృషబాబు పాడారు.
కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘‘ఈ చిత్రంలో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తారు. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్.
Comments
Please login to add a commentAdd a comment