రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆర్థిక, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న సత్య ప్రకాశ్ టక్కర్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం అజేయ కల్లాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఆయన మార్చి నెలాఖరునే పదవీ విరమణ చేయనున్నారు. అజేయ కల్లం రాష్ట్రంలో పలు కీలక శాఖల్లో పనిచేశారు. సమర్థ్ధవంతమైన అధికారిగా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తారని పేరుంది.