రాష్ట్ర విభజనలో కీలకమైన ఫైళ్ల విభజనను పూర్తి చేసిన అన్ని శాఖలు ఇప్పుడు ఆ ఫైళ్ల డిజిటైజేషన్‌పై దృష్టి సారించాయి.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కీలకమైన ఫైళ్ల విభజనను పూర్తి చేసిన అన్ని శాఖలు ఇప్పుడు ఆ ఫైళ్ల డిజిటైజేషన్‌పై దృష్టి సారించాయి. ఏ ఫైళ్లు ఎప్పటినుంచి డిజిటైజ్ చేయాలి, ఏ ఫైళ్ల డిజిటైజేషన్ అవసరం లేదనే వివరాలతో విభజనకు సంబంధించిన అపెక్స్ కమిటీ చైర్మన్ టక్కర్ అన్ని శాఖలకు గురువారం సర్క్యులర్ జారీ చేశారు. దీంతో రెండురోజుల్లో అన్ని శాఖల్లో ఫైళ్ల డిజిటైజేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రూ.6 కోట్ల వ్యయం కాగల ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. 30వ తేదీలో గా పూర్తి చేయాలని ఆదేశించారు.
సర్క్యులర్ వివరాలు..
ఇరు రాష్ట్రాలకు చెందిన 2008 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2014 మార్చి 31 వరకు గల డిస్పోజల్ ఫైళ్లను మాత్రమే డిజిటైజ్ చేయాలి. అలాగే 2008 ఏప్రిల్ 1 నుంచి 2014 జూన్ 1వ తేదీ వరకు గల కరెంట్ ఫైళ్లను కూడా చేయాలి.
విధానపరమైన ప్రధాన అంశాలకు చెందిన ఫైళ్లను, చట్ట సవరణలు, నియమ నిబంధనలు, ప్రాజెక్టులు, క్రమశిక్షణ కేసులు, విజిలెన్స్ అంశాలు, కోర్టు కేసులకు సంబంధించి 2008 ఏప్రిల్ 1కి ముందున్న ఫైళ్లను డిజిటైజ్ చేయాలి. అన్ని చెల్లింపులకు సంబంధించిన పాత బిల్లులను డిజిటైజ్ చేయాలి. హార్డ్ కాపీలను రికార్డ్ రూమ్‌లకు పంపాలి.
ఏ రకమైన ఫైళ్లను జిరాక్స్ తీయరాదు. 2014 జూన్ 1 తర్వాత కొనసాగే కరెంట్ ఫైళ్ల జిరాక్స్‌లకే అనుమతి.
ఇవి అవసరం లేదు..: సెలవు మంజూరు, ఇంక్రిమెంట్-వేతన స్థిరీకరణ, అడ్మిషన్-రిలీవింగ్-రిటైర్‌మెంట్ ఆర్డర్లు, సబ్జెక్టుల పంపిణీ, టూర్‌ల అనుమతి, లీవ్ ట్రావెల్ అలవెన్స్, గేట్ ఎంట్రీ పాస్, టెలిఫోన్ బిల్లులు, అద్దెకు వాహనాలు, ఆడిట్ జరిగిన స్టేషనరీ కొనుగోళ్లు, గత సంవత్సరాలకు చెందిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల వేతనాల బిల్లులు, సర్వీసు రిజిస్టర్‌లో నమోదైన జీపీఎఫ్ విత్‌డ్రా, శా ఖలకు సమాచారం కోసం జారీ చేసిన మెమోలు, బదిలీలు, పోస్టింగులు, అదనపు బాధ్యతల అలెవెన్సులు, పరిష్కృత వైద్య బిల్లులు ఇతర చిన్నచిన్న అంశాలకు చెందిన ఫైళ్లు.