చిన్న, మధ్య తరహ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు
నెల్లూరు(పొగతోట):
చిన్న, మధ్యతరహ పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి టక్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రాథమిక రంగాలు రెండంకెల వృద్ధి రేటు సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. డబుల్ డిజిట్ 15 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణాలకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు. ఏపీఐఐసీకి భూములు కేటాయించి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇండస్ట్రియల్ పార్కులు, ఎస్‌ఈజెడ్‌లకు భూములు కేటాయించాలన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. తొలుత కలెక్టర్ ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ వీడియో కాన్ఫరెన్స్‌కు సంబం«ధించి ఆయా శాఖల అధికారులతో వారి చాంబర్లల్లో సమావేశాలు నిర్వహించారు.