కయ్యాలే...కయ్యాలే | Siddharth and Divyansha Kaushik starrer Kayyale video song out | Sakshi
Sakshi News home page

కయ్యాలే...కయ్యాలే

Published Sat, May 6 2023 4:34 AM | Last Updated on Sat, May 6 2023 6:41 AM

Siddharth and Divyansha Kaushik starrer Kayyale video song out - Sakshi

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్‌ జంటగా నటించిన రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘టక్కర్‌’. కార్తీక్‌ జి. క్రిష్‌ దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, ఫ్యాషన్‌ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ చిత్రం నుంచి ‘కయ్యాలే...కయ్యాలే’ అంటూ సాగే లిరికల్‌ వీడియో సాంగ్‌ను ఇటీవల చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. నివాస్‌ కె. ప్రసన్న సంగీత సారథ్యంలో కృష్ణకాంత్‌ లిరిక్స్‌ అందించిన ఈ పాటను నిరంజన్‌ రామనన్‌ ఆలపించారు. ఈ సినిమాకు సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మయాంక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement